NTV Telugu Site icon

Munugode By Poll : నేడు నామినేషన్‌ వేయనున్న పాల్వాయి స్రవంతి

Palvai Sravanthi

Palvai Sravanthi

తెలంగాణలో ప్రస్తుతం హాట్‌ టాపిక్‌గా మారింది మునుగోడు ఉప ఎన్నిక. అయితే.. ఇప్పటికే మునుగోడు ఉప ఎన్నికల నామినేషన్‌ ప్రక్రియ ప్రారంభమైంది. మునుగోడు ఉప ఎన్నికల బరిలో చాలామందే నామినేషన్లు వేశారు. అయితే.. ప్రధాన పోటీ మాత్రం అధికార టీఆర్‌ఎస్‌, బీజేపీ, కాంగ్రెస్‌ల మధ్యనే ఉండనుంది. అయితే.. నామినేషన్‌ గడువు నేటితో ముగియనుంది. ఈ రోజు కాంగ్రెస్‌ అభ్యర్థి పాల్వాయి స్రవంతి నామినేషన్‌ వేయనున్నారు. అయితే ఆమె భారీ ర్యాలీగా వెళ్లి నామినేషన్‌ వేయనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి, టీఆర్‌ఎస్‌ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌ రెడ్డిలు భారీ ర్యాలీ, అట్టహాసంగా వెళ్లి నామినేషన్‌లు దాఖలు చేశారు. అయితే.. అందుకు తగట్టుగానే పాల్వాయి స్రవంతి కూడా భారీగా కాంగ్రెస్‌ శ్రేణులతో నామినేషన్‌కు వెళ్లనున్నారు. దీనికోసం ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశారు కాంగ్రెస్‌ నేతలు.

Also Read : Weather Update : తెలంగాణలో నేడు, రేపు పలు చోట్ల భారీ వర్షాలు

ఇదిలా ఉంటే.. నవంబర్‌ 3న పోలింగ్‌, నవంబర్‌ 6న ఓట్లలెక్కింపు జరుగనుంది. అయితే.. కాంగ్రెస్‌ నుంచి పోటీ చేస్తున్న పాల్వాయి స్రవంతిని గెలిపించాలని ఇప్పటికే టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి ప్రచారం నిర్వహిస్తున్నారు. కేంద్రంలో ఉన్న బీజేపీ, రాష్ట్రంలో ఉన్న టీఆర్‌ఎస్‌ పార్టీలు మునుగోడు అభివృద్ధిని విస్మరించాయని ఆయన అన్నారు. మునుగోడులో జెండా పాతేందుకు బీజేపీ, టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ నేతలు ఉవిళ్లురుతున్నారు. అందుకోసం విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు.