Munugode By Poll : నేడు నామినేషన్ వేయనున్న పాల్వాయి స్రవంతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణలో ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది మునుగోడు ఉప ఎన్నిక. అయితే.. ఇప్పటికే మునుగోడు ఉప ఎన్నికల నామినేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. మునుగోడు ఉప ఎన్నికల బరిలో చాలామందే నామినేషన్లు వేశారు. అయితే.. ప్రధాన పోటీ మాత్రం అధికార టీఆర్‌ఎస్, బీజేపీ, కాంగ్రెస్‌ల మధ్యనే ఉండనుంది. అయితే.. నామినేషన్ గడువు నేటితో ముగియనుంది. ఈ రోజు కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతి నామినేషన్ వేయనున్నారు. అయితే ఆమె భారీ ర్యాలీగా వెళ్లి నామినేషన్ వేయనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, టీఆర్‌ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిలు భారీ ర్యాలీ, అట్టహాసంగా వెళ్లి నామినేషన్‌లు దాఖలు చేశారు. అయితే.. అందుకు తగట్టుగానే పాల్వాయి స్రవంతి కూడా భారీగా కాంగ్రెస్ శ్రేణులతో నామినేషన్‌కు వెళ్లనున్నారు. దీనికోసం ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశారు కాంగ్రెస్ నేతలు.
Also Read : Weather Update : తెలంగాణలో నేడు, రేపు పలు చోట్ల భారీ వర్షాలు
Also Read
- Modi-Bear Grylls: మోడీ ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన నాయకుడు.. బేర్ గ్రిల్స్ ప్రశంసలు
- Taslima Nasrin: 20 ఏళ్ల నిరీక్షణకు ముగింపు.. కోల్‌కతాకు తిరిగి వస్తున్న తస్లీమా
- CM Chandrababu: ఏపీ పెట్టుబడుల గమ్యస్థానం.. అభివృద్ధిపై సీఎం కీలక వ్యాఖ్యలు
- Samay Raina: నటుడు సమయ్ రైనాకు సుప్రీంకోర్టు షాక్.. రూ.10 లక్షల జరిమానా
ఇదిలా ఉంటే.. నవంబర్ 3న పోలింగ్, నవంబర్ 6న ఓట్లలెక్కింపు జరుగనుంది. అయితే.. కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తున్న పాల్వాయి స్రవంతిని గెలిపించాలని ఇప్పటికే టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ప్రచారం నిర్వహిస్తున్నారు. కేంద్రంలో ఉన్న బీజేపీ, రాష్ట్రంలో ఉన్న టీఆర్‌ఎస్ పార్టీలు మునుగోడు అభివృద్ధిని విస్మరించాయని ఆయన అన్నారు. మునుగోడులో జెండా పాతేందుకు బీజేపీ, టీఆర్‌ఎస్, కాంగ్రెస్ నేతలు ఉవిళ్లురుతున్నారు. అందుకోసం విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు.
తాజావార్తలు
-
Modi-Bear Grylls: మోడీ ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన నాయకుడు.. బేర్ గ్రిల్స్ ప్రశంసలు
-
CM Vijay: సీఎం అయ్యాక పేరు మార్చుకున్న విజయ్?
-
Taslima Nasrin: 20 ఏళ్ల నిరీక్షణకు ముగింపు.. కోల్‌కతాకు తిరిగి వస్తున్న తస్లీమా
-
CM Chandrababu: ఏపీ పెట్టుబడుల గమ్యస్థానం.. అభివృద్ధిపై సీఎం కీలక వ్యాఖ్యలు
-
Shruti Haasan : సొంతంగా ఇల్లు కొని ఒంటరిగా గృహప్రవేశం చేసిన శృతి హాసన్.. అసలేం జరిగింది?
ట్రెండింగ్
-
స్టైలిష్ డిజైన్, పానోరమిక్ సన్‌రూఫ్‌తో కొత్త Renault Duster Adventure ఎడిషన్ లాంచ్.! ధర ఎంతంటే.?
-
ఏడు నెలల్లో మూడోసారి ధరల పెంపు.. Mahindra Thar కొత్త రేట్లు ఇవే..!
-
CSK Head Coach: సీఎస్‌కే కొత్త కోచ్ రేసులో ముగ్గురు.. భారత్ నుంచి ఇద్దరు క్రికెట్ దిగ్గజాలు!
-
Poha: 10 నిమిషాల్లో టేస్టీ అటుకుల పులిహోర.. ఇలా చేస్తే రుచి అదిరిపోతుంది..!
-
Ashleigh Gardner Controversy: ఆసీస్ మహిళా క్రికెటర్ల మధ్య అక్రమ సంబంధం.. భార్య ఉండగానే సహచర ప్లేయర్‌తో ఎఫైర్!