NTV Telugu Site icon

Deputy CM Pawan Kalyan: మాజీ మంత్రి కాకాణిపై డిప్యూటీ సీఎం పవన్‌కు ఫిర్యాదు..

Pawan Kalyan

Pawan Kalyan

Deputy CM Pawan Kalyan: మాజీ మంత్రి, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నేత కాకాణి గోవర్ధన్ రెడ్డిపై ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌కు ఫిర్యాదు అందించింది.. కాకాణిపై పవన్‌కు ఫిర్యాదు చేశారు ముత్తుకూరు సర్పంచ్ బూదూరు లక్ష్మి.. డిప్యూటీ సీఎం పవన్‌ను అసెంబ్లీలోని ఆయన కార్యాలయంలో కలిసి.. లక్ష్మికి జరిగిన అన్యాయం వివరించారు టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి.. కాకాణి గోవర్థన్ రెడ్డి, వైసీపీ నాయకులు తనపై చేసిన బెదిరింపులు, దౌర్జన్యాలను పవన్ కు ఫిర్యాదు చేశారు లక్ష్మి.. ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన తనపై వైకాపా నాయకులు, ఉప సర్పంచ్, పంచాయతీ కార్యదర్శి కుల దూషణకి పాల్పడుతున్నారని తమ ఫిర్యాదులో పేర్కొన్నారు.. ఊరి నుంచి వెళ్లిపోవాలని హెచ్చరించినట్లు ఫిర్యాదు చేసిన ఆమె.. ఎన్నికైనప్పటి నుంచి బెదిరింపులకు దిగి బలవంతంగా సంతకాలు చేయించారని ఆవేదన వ్యక్తం చేశారు.. ఇక, లక్ష్మి ఫిర్యాదుపై పూర్తి వివరాలు తన ముందు ఉంచాలని అధికారులను ఆదేశించారు డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌.. ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన మహిళ సర్పంచ్ పట్ల కుల దూషణలకి పాల్పడ్డ వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా స్పష్టం చేశారు పవన్‌ కల్యాణ్‌.

Read Also: Puja Khedkar: పూజా ఖేద్కర్ మిస్సింగ్.. 5 రోజులుగా తెలియని జాడ!

Show comments