NTV Telugu Site icon

Muthireddy Yadagiri Reddy : రాబోయే ఎన్నికల్లో మూడోసారి గెలవడం ఖాయం.. ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి కీలక వ్యాఖ్యలు

Muthireddy Yadagiri Reddy

Muthireddy Yadagiri Reddy

బీఆర్‌ఎస్‌ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్‌ రానున్న ఎన్నికల బరిలో బీఆర్‌ఎస్‌ నుంచి పోటీ చేయనున్న అభ్యర్థుల జాబితాను ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే.. రాష్ట్రంలో 119 స్థానాలకు గానూ 115 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన సీఎం కేసీఆర్‌.. 4 స్థానాల్లో అభ్యర్థుల ప్రకటనను పెండింగ్‌లో పెట్టారు. అయితే.. అంతేకాకుండా.. ప్రకటించిన 115 స్థానాల్లో ఏడుగురు సిట్టింగ్‌లను మార్చుతూ ప్రకటన చేశారు. అయితే.. పెండింగ్‌లో ఉంచిన 4 స్థానాల్లో ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం జనగాం ఒకటి. అయితే.. ఈసారి ముత్తిరెడ్డికి కాకుండా జనగాం టికెట్‌ పల్లా రాజేశ్వర్‌ రెడ్డికి ఇస్తారనే ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే మీడియా ముఖంగా ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి ఈ సారి కూడా తనకు అవకాశం కల్పించాలని సీఎం కేసీఆర్‌ను కోరారు.

అంతేకాకుండా.. నియోజకవర్గంలో బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలు పోటీ లేకుండా.. బీఆర్‌ఎస్‌ పార్టీ బలోపేతానికి కృషి చేశానని ఆయన అన్నారు. ఈ క్రమంలోనే ఇవాళ జనగామ జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి మాట్లాడుతూ.. నియోజకవర్గంలో జరుగుతున్న పరిణామాలను పార్టీ నిశితంగా పరిశీలిస్తుందన్నారు. ఇద్దరు ఎమ్మెల్సీలను మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కట్టడి చేశారని, నియోజకవర్గంలో ఎవరు గందరగోళానికి గురికావాల్సిన అవసరం లేదని ఆయన వ్యాఖ్యానించారు. పార్టీ ఎవరిని తప్పు పట్టదు, డిస్టబెన్స్ చేసిన వారిని మాత్రమే తప్పుపడుతుందని, స్థానిక ప్రజా ప్రతినిధులు ఎవరు బెంగ పెట్టుకోకూడదు, పార్టీ అందరిని ఆదరిస్తుంది, అందరం కలిసి పని చేద్దామని ఆయన అన్నారు.

రాబోయే ఎన్నికల్లో ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి మూడోసారి గెలవడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఇప్పటివరకు ఇబ్బంది పెట్టిన నాయకులకు విజ్ఞప్తి చేస్తున్న మరొకసారి ఇబ్బంది పెట్టొద్దని అని ఆయన అన్నారు. జనగామ జిల్లా ప్రజల కోరికలు ఒక్కొక్కటి నెరవేరుతున్నాయన్న ముత్తిరెడ్డి.. జిల్లా ఆకృతి రూపుదిద్దుకుంటుందన్నారు. జిల్లా కోర్టుకు 10 ఎకరాలు కేటాయించామని, జిల్లా పోలీసు కార్యాలయం ఏర్పాటు చేయడం జరుగుతుందని, ఈ నెల 15 వ తేదీన సీఎం కేసీఆర్ మెడికల్ కాలేజీని వర్చువల్ గా ప్రారంభిస్తారన్నారు. అదేరోజున పెద్ద ఎత్తున జిల్లా నుండి ప్రజలు తరలివచ్చి కార్యక్రమం దిగ్విజయం చేయాలని ఎమ్మెల్యే ముత్తిరెడ్డి కోరారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా, ఏవిధంగా వచ్చిన సీఎం కేసీఆర్ దేశానికి సారథ్యం వహిస్తారని ఆయన వ్యాఖ్యానించారు.