Site icon NTV Telugu

Kota Neelima: మజీద్‌లో ప్రచారం.. కాంగ్రెస్ అభ్యర్థి కోట నీలిమను అడ్డుకున్న ముస్లింలు

Kota Neelima

Kota Neelima

Kota Neelima: తెలంగాణలో జోరుగా ఎన్నికల ప్రచారం కొనసాగుతోంది. అన్ని పార్టీల అభ్యర్థులు ఓటరు మహాశయులను ప్రసన్నం చేసుకునే పనిలో నిమగ్నమయ్యారు. తమకు ఓటేసి గెలిపించాలని ప్రజలను విజ్ఞప్తి చేస్తున్నారు. సనత్‌నగర్‌ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి కోట నీలిమ కూడా జోరుగా ప్రచారం కొనసాగిస్తున్నారు. ఇదిలా ఉండగా.. బేగంపేట్ మజీద్‌లో ఎన్నికల ప్రచారం చేస్తున్న సనత్‌నగర్ కాంగ్రెస్ అభ్యర్థి కోట నీలిమను ముస్లింలు అడ్డుకున్నారు.

Also Read: YS Sharmila: పదేళ్లు తెలంగాణలో జరిగింది దోపిడీ,దౌర్జన్యాలతో కూడిన నియంత పాలన

తనకు ఓటేసి గెలిపించాలని అక్కడ ఉన్నవారిని అభ్యర్థిస్తుండగా.. అక్కడ ఇరు వర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌ అభ్యర్థి కోట నీలిమ బేగంపేట్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడానికి వెళ్లినట్లు సమాచారం. తన ప్రచారంలో అనవసరంగా అడ్డంకులు సృష్టిస్తున్నారని ఆమె ఫిర్యాదు చేసేందుకు వెళ్లినట్లు తెలిసింది.

Exit mobile version