NTV Telugu Site icon

Converted To Hinduism: ఇద్దరు పిల్లలతో కలిసి హిందూ మతంలోకి మారిన ముస్లిం మహిళ.. ఎందుకంటే..?

Hindu

Hindu

మధ్యప్రదేశ్‌లోని మందసౌర్ జిల్లాలో భర్త వేధింపులు తట్టుకోలేక ఓ ముస్లిం మహిళ తన ఇద్దరు పిల్లలతో కలిసి హిందూ మతంలోకి మారింది. హిందూ మతంపై తనకున్న అచంచల విశ్వాసాన్ని తెలుపుతూ ఆ మహిళ తన కుమారులకు లవ్-కుష్ అని పేరు పెట్టింది. మెహనాజ్ బికి బదులుగా మీనాక్షిగా పేరు మార్చుకుంది. సనాతన సంప్రదాయంలో మహిళలకు ఉన్న గౌరవాన్ని దృష్టిలో ఉంచుకుని తాను హిందూమతంలో చేరాలని నిర్ణయించుకున్నట్లు చెప్పింది.

Read Also: Shabbir Ali: ఇండోర్‌ స్టేడియం నిర్మాణానికి షబ్బీర్ అలీ శంకుస్థాపన

వివరాల్లోకి వెళ్తే.. ధమ్నార్ గ్రామంలో నివసిస్తున్న మెహనాజ్ (30), 12 మరియు 11 సంవత్సరాల వయస్సు గల ఇద్దరు కుమారులతో కలిసి బుధవారం మందసౌర్‌లోని గాయత్రి ఆలయంలో హిందూ మతంలోకి మారింది. సుమారు గంటన్నరపాటు మంత్రాలు పఠించిన తర్వాత తమ కొడుకలకు నామకరణం చేశారు. అనంతరం.. మెహనాజ్ మాట్లాడుతూ, సనాతన ధర్మంలో మహిళలకు గౌరవం ఉందని యూట్యూబ్‌లో, ఇతర ప్రాంతాల్లో చూసేదానినని చెప్పింది. కుటుంబంలో వారికి గౌరవం ఉంటుంది. ఈ క్రమంలోనే.. హిందూ సంస్థకు చెందిన వారిని సంప్రదించి సనాతన ధర్మాన్ని స్వీకరించినట్లు మెహనాజ్ బీ(మీనాక్షి) చెప్పుకొచ్చింది. మెహనాజ్ బీకి 15 సంవత్సరాల క్రితం ధన్మార్‌కు చెందిన ఇర్ఫాన్ ఖాన్‌తో వివాహం జరిగింది. మొదట్లో అంతా బాగానే ఉన్నా ఆ తర్వాత భర్తతో పాటు అత్తమామల ప్రవర్తనలో కూడా మార్పు వచ్చిందని తెలిపింది. చిన్న చిన్న విషయాలకే గొడవలు మొదలయ్యాయని.. ఏ చిన్న సమస్య వచ్చినా తిడుతూ కొట్టేవాడని పేర్కొంది. ఈ విషయం తన నాన్నకు చెప్పగా, ఇది మీ కుటుంబ విషయం అని అన్నాడని చెప్పింది.

Read Also: Ukraine-Russia War: ‘కరిగిన థర్మైట్’ అంటే ఏమిటి..? రష్యాపై వేడి పుట్టిస్తోన్న కొత్త డ్రోన్లు

హిందూ యువ వాహిని రాష్ట్ర ఇన్‌ఛార్జ్ చైతన్య సింగ్ రాజ్‌పుత్ మాట్లాడుతూ.. రెండు మూడు నెలల క్రితం మెహనాజ్ హిందూ మతంలోకి రావడానికి సంప్రదించినట్లు చెప్పారు. అన్ని చట్టపరమైన ప్రక్రియలను పూర్తి చేసిన తర్వాత, మెహనాజ్.. ఆమె ఇద్దరు కుమారులు గాయత్రీ పరివార్ ఆలయానికి వచ్చారని తెలిపాడు. మీనాక్షి, ఆమె ఇద్దరు కుమారులు లవ్-కుష్ హిందూ మతంలోకి రావడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఇప్పటి వరకు 40 మంది మహిళలు, 5 మంది పురుషులు, ఇద్దరు పిల్లలను పూర్తిగా చట్టపరమైన విధానాలను అనుసరించి హిందూ మతంలోకి వచ్చారని రాజ్‌పుత్ చెప్పారు. హిందూ మతంలో చేరిన వారంతా సంతోషంగా జీవిస్తున్నారని అన్నారు.

Show comments