Site icon NTV Telugu

Uttar Pradesh: భజన కీర్తన పాడడని ఆగ్రహించిన ముస్లింలు.. దారుణ హత్య

Up

Up

ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలో రోజుకో ఘోరమైన ఘటనలు వెలుగులోకి వస్తునే ఉంటాయి. అయితే, తాజాగా ముజఫర్‌నగర్‌లో భజన కీర్తన పాడినందుకు వివాదంలో చిక్కుకున్న ముస్లిం గాయకుడి సోదరుడు ని గుర్తు తెలియని దుండగులు కత్తితో పొడిచి చంపేసినట్లు పోలీసులు తెలిపారు. బాధితుడు ఖుర్షీద్.. సింగర్ ఫర్మానీ నాజ్ కి వరుసకు తమ్ముడవుతాడని పోలీసులు పేర్కొన్నారు. రతన్‌పురిలోని ముహమ్మద్‌పూర్ మాఫీ గ్రామంలో శనివారం రాత్రి ఈ దారుణమైన ఘటన జరిగినట్లు సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ శ్రీవాస్తవ వెల్లడించారు.

Read Also: Mukesh Ambani Salary: భారత కుబేరుడు ముఖేష్ అంబానీ జీతం ఎంతో తెలిస్తే షాక్ అవటం ఖాయం

ఇక, మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం పంపించామని పోలీసులు పేర్కొన్నారు. ఈ ఘటనపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించామని ఎస్పీ శ్రీవాస్తవ తెలిపారు. శివుడిని స్తుతిస్తూ భక్తిగీతమైన నాజ్ గత సంవత్సరం హర్ హర్ శంభు అంటూ సాగే పాటను పాడాడు.. దీన్ని దేవ్‌బంద్ కు చెందిన ఓ మతగురువుతో అన్-ఇస్లామిక్, హరామ్ అని మతవిశ్వాసాలకు విరుద్ధమని ఫర్మానా జారీ చేశారు అని పోలీసుల విచారణలో తెలింది.

Read Also: Kishan Reddy: గద్దర్ లేని పాట మూగబోయింది..

దీనికి జవాబుగా కళాకారులకు మతం లేదని, తాను తప్పు చేయలేదని ముజఫర్‌నగర్‌కు చెందిన నాజ్‌ తనను తాను సమర్థించుకున్నారు. సింగింగ్ రియాలిటీ షో ఇండియన్ ఐడల్ సీజన్ 12లో కూడా నాజ్ పాల్గొన్నారు. నాజ్ యూట్యూబ్ ఛానెల్‌కు 4.5 మిలియన్ల కంటే ఎక్కువ సబ్ స్క్రైబర్లు ఉన్నారు. ఇదిలా ఉండగా నాజ్ సోదరుడు ఖుర్షీద్ హత్య కేసులో ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితులు అద్నాన్, వాజిద్, జుబేర్ లుగా పోలీసులు గుర్తించారు. వారి దగ్గర నుంచి మారణాయుధాలను స్వాధీనం చేసుకున్నారు. అయితే, వీరందరు కూడా నాజ్ కు బంధువులు.. సోదరులవుతారు.. వీరిని పోలీసులు ప్రస్తుతం విచారిస్తున్నారు.

Exit mobile version