Site icon NTV Telugu

Murder In Hyderabad: బోరబండలో కలకలం.. మాట్లాడటం లేదని యువతిని హత్య చేసిన యువకుడు

Rayachoty Murder

Rayachoty Murder

Murder In Hyderabad: హైదరాబాద్ మహానగరంలో గత కొంత కాలంగా జరుగుతున్న వరుస హత్యలు ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా బోరబండ ప్రాంతంలో చోటుచేసుకున్న ఓ యువతి హత్య ఘటన నగరాన్ని మరోసారి షాక్‌కు గురిచేసింది. తనతో సరిగ్గా మాట్లాడటం లేదన్న అనుమానంతో ఓ యువకుడు యువతిని కిరాతకంగా హత్య చేసినట్లు పోలీసులు వెల్లడించారు.

Virat Kohli: ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులన్నీ అమ్మకే ఇస్తా.. విరాట్ భావోద్వేగం..!

పోలీసుల అందించిన వివరాల ప్రకారం… బంజారాహిల్స్‌లోని ఓ పబ్‌లో పనిచేసే సమయంలో యువతికి నిందితుడికి పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం క్రమంగా స్నేహంగా మారింది. అయితే ఇటీవల యువతి ఊర్వశీ బార్‌కు ఉద్యోగం మారడంతో నిందితుడితో మాట్లాడటం తగ్గింది. దీనితో ఆమెపై అనుమానం పెంచుకున్న యువకుడు, తనను నిర్లక్ష్యం చేస్తోందన్న కోపంతో తీవ్రంగా ఆగ్రహానికి లోనయ్యాడు.

Crime News: భార్యను కాపురానికి పంపని అత్తను.. దారుణంగా హత్య చేసిన అల్లుడు

ఈ నేపథ్యంలో మాట్లాడుకుందామని చెప్పి యువతిని కలవడానికి పిలిచిన నిందితుడు అక్కడే ఆమెను హత్య చేశాడు. యువతి మృతి చెందడంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయగా, వెంటనే రంగంలోకి దిగిన బోరబండ పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం నిందితుడిని విచారిస్తున్న పోలీసులు హత్యకు గల పూర్తి కారణాలు, ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలను సేకరిస్తున్నారు.

Exit mobile version