Murder : తల్లి లేకపోవడం తండ్రి హత్యకు గురవడంతో మైనర్లు అయిన వారి కుమార్తెలు అనాథలయ్యారు. ఏలూరుకు చెందిన వెంకటకనకరాజుకు ముగ్గురు ఆడపిల్లలు ఆయన భార్య ఎనిమిదేళ్ల కిందట మరణించింది. అప్పటినుంచి పిల్లల బాధ్యతను ఆయనే చూస్తున్నారు. ఏలూరులోని రామకృష్ణాపురం రైల్వే బ్రిడ్జి కింద కన కరాజు హత్యకు గురయ్యారు. పెద్ద కుమార్తెను తనకు ఇచ్చి పెళ్లి చేయడం లేదని కక్ష గట్టిన నాని అనే యువకుడు ఆయనను కత్తితో పొడిచాడు. కనక రాజు మృతదేహానికి సర్వజన ఆసుపత్రి వద్ద పోస్టుమార్టం నిర్వహించి బంధువులకు అప్ప గించారు. ఈ క్రమంలో కనకరాజు తల్లి, బంధువులు, ముగ్గురు ఆడపిల్లలు ఆసుపత్రి మార్చురీ వద్దకొచ్చారు.
Gold Rate Today: గోల్డ్ లవర్స్‌కి గుడ్ న్యూస్.. హైదరాబాద్‌లో తులం ఎంతుందంటే?
పోస్టుమార్టం కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తున్న త్రీటౌన్ సీఐ కోటేశ్వరరావు వృద్ధురాలైన కనకరాజు తల్లి ముగ్గురు పిల్లలతో మాట్లాడారు. బాగా చదవాలని, కష్టాలు తొలగిపోతాయని వారికి భరోసా ఇచ్చారు. అవసరమైతే చదివించే బాధ్యత తీసుకుంటానన్నారు. ఈ సందర్భంగా సీఐ కోటేశ్వరరావు మాట్లాడుతూ నిందితుడు నాని కోసం రెండు బృందాలను రంగంలోకి దీంపామని, అరెస్టు చేస్తామని తెలిపారు.
KTR Tweet: కాంగ్రెస్ పై ప్రివిలేజ్ మోషన్ ప్రవేశపెడతాం.. అప్పుల అంశంపై కేటీఆర్ ట్వీట్..