Murder Attempt: అదనపు కట్నం.. మహిళలకు శాపంగా మారుతోంది. కొంత మంది భర్తలు.. సంపాదించకుండా..జులాయిగా తిరుగుతూ డబ్బు కోసం చివరికి భార్యలనే దారుణంగా వేధిస్తున్నారు. అదనపు కట్నం తీసుకు రావాలని చిత్రహింసలు పెడుతున్నారు. ఒక్కోసారి హత్య చేసేందుకు వెనకాడడం లేదు. తాజాగా హైదరాబాద్ నాగోల్‌లో ఓ శాడిస్ట్ మొగుడు.. అదనపు కట్నం కోసం భార్యపై హత్యాయత్నం చేశాడు.
ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి పేరు వేణుగోపాల్. ఇతనికి ఏడాది క్రితం మహాలక్ష్మితో అంగరంగ వైభవంగా పెళ్లి జరిగింది. పెళ్లి సమయంలో 15 లక్షల రూపాయల కట్నకానుకలతోపాటు 15 తులాల బంగారం ఇచ్చారు. నాగోల్‌లోని లక్ష్మీనరసింహా కాలనీలో కాపురం పెట్టాడు. కొంత కాలం కాపురం బాగానే సాగింది. ఆ తర్వాత వేణుగోపాల్ మారిపోయాడు. కట్నంగా ఇచ్చిన డబ్బులను తాగుడుకి సమర్పించాడు. అత్తమామలు ఇచ్చిన 15 తులాల బంగారాన్ని కుదవ పెట్టాడు. ఇంకా అదనపు కట్నం కావాలని భార్యను నిత్యం వేధించడం మొదలు పెట్టాడు.
Waqf Amendment Act: వక్ఫ్ సవరణ చట్టంపై సుప్రీం కీలక తీర్పు.. స్వాగతించిన మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్
అంతేకాదు.. మహాలక్ష్మికి తెలియకుండా ఆమె బంగారు నగలు కొన్నింటిని అమ్మేశాడు. విషయం గ్రహించిన ఆమె మిగిలిన బంగారు నగలను తన తల్లిదండ్రుల వద్ద పెట్టింది. రోజూ మద్యం తాగి వచ్చి భార్యతో గొడవపడుతూ డబ్బులు తీసుకురావాలని ఒత్తిడి చేసి కొట్టేవాడు. దీంతో పాటు కొందరు మహిళలతో చాటింగ్ చేసే వాడు. మహిళలతో చాటింగ్ విషయంపై ప్రశ్నిస్తే కొట్టి రోడ్డుపైకి గెంటేసేవాడు. భర్త వేధింపులు తాళలేక జులైలో మహలక్ష్మీ నాగోల్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. భార్యాభర్తలు ఇద్దరిని పోలీసులు కౌన్సిలింగ్ సెంటర్‌కు పంపి రాజీ కుదిర్చారు.
Deer Meat In HYD: అంతేనేమో డాక్టర్.. చేసేదేమో గలీజ్ పని!
ఇక బంధువుల గృహ ప్రవేశం ఉండటంతో తనతో రావాలని భార్య మహలక్ష్మీ, భర్త వేణుగోపాల్‌ను కోరింది. నేను రానంటూ బిగ్గరగా అరుస్తూ ఆమెపై దాడికి పాల్పడ్డాడు. తన వద్ద ఉన్న పేపర్ కటింగ్ బ్లేడ్‌తో మహలక్ష్మి గొంతు కోశాడు. ఒకవైపు గొంతు భాగం నుంచి తీవ్ర రక్తస్రావం జరుగుతుండగా భర్తను తోసేసి రోడ్డుపైకి పరుగెత్తుకుంటూ వచ్చి కేకలు వేసింది. దీంతో స్థానికులు డయల్ 100కు ఫోన్ చేశారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని చికిత్స నిమిత్తం మహాలక్ష్మిని నాగోల్‌లోని సుప్రజ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి నిలకడగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. మహాలక్ష్మీ ఇచ్చిన వాంగ్మూలం మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. భార్యను హతమార్చేందుకు యత్నించిన వేణుగోపాల్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడి నుంచి గొంతు కోసేందుకు ఉపయోగించిన కత్తిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
