Site icon NTV Telugu

M*urder Attack: మియాపూర్ లో దారుణం.. తనను కాదని మరో వ్యక్తిని పెళ్లి చేసుకుందన్న కోపంతో మహిళపై కత్తితో దాడి.!

Murder Attack

Murder Attack

Murder Attack: హైదరాబాద్ నగరంలోని మియాపూర్ ప్రాంతంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. తనను కాదని మరో వ్యక్తిని పెళ్లి చేసుకుందన్న కోపంతో ఓ మహిళపై కత్తితో దాడి చేసిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. కాకినాడకు చెందిన నూకరత్నం అనే మహిళ మియాపూర్‌లో హౌస్‌కీపింగ్ ఉద్యోగం చేస్తూ జీవనం సాగిస్తోంది. గతంలో భర్తను కోల్పోయిన ఆమెకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఇటీవలే గత నెల 20న ప్రసాద్ అనే వ్యక్తిని ఆమె వివాహం చేసుకుంది. ఇదే సమయంలో నూకరత్నం పనిచేసే చోట వంటమనిషిగా పనిచేస్తున్న ఆలీషా అలియాస్ పాండు ఆమెపై కక్ష పెంచుకున్నాడు. తనకు తెలియకుండా ప్రసాద్‌ను పెళ్లి చేసుకోవడం కారణంగా అతడు ఆగ్రహానికి గురైనట్లు సమాచారం.

Food Adulteration: కుల్సుంపురాలో ఫుడ్ స్కాం బట్టబయలు.. కుళ్లిన పదార్థాలతో భారీగా సమోసాలు తయారీ..!

ఈ నెల 19న ఆలీషా తన తండ్రి లాలూ, స్నేహితుడు జాన్‌తో కలిసి నూకరత్నం ఇంటికి వెళ్లాడు. తన వెంట రావాలని ఆమెతో వాగ్వాదానికి దిగాడు. అయితే నూకరత్నం నిరాకరించడంతో కోపంతో వెంట తీసుకువచ్చిన కత్తితో ఆమెపై దాడి చేశాడు. ఈ దాడిలో నూకరత్నం తీవ్రంగా గాయపడింది. స్థానికులు వెంటనే స్పందించి ఆమెను ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమెకు చికిత్స కొనసాగుతోంది. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులు ఆలీషా అలియాస్ పాండు, అతని తండ్రి లాలూను అరెస్ట్ చేశారు.

Viral Video: ఏం ఐడియా వేశావ్ గురూ.. “మీ బాధలు నాతో పంచుకోండి” అంటూ డబ్బులు సంపాదన.. వీడియో వైరల్..!

Exit mobile version