నేను మల్కాజ్ గిరి పార్లమెంట్ నుంచి పోటీ చేస్తానని బీజేపీ మధ్యప్రదేశ్ ఇంఛార్జి మురళిధర్ రావు అన్నారు. కేసీఆర్ స్ట్రాటజీ మిస్ అవుతున్నాడు.. కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో ఫెయిల్ అయ్యారు.. కుమార స్వామినీ వదిలేశాడు.. సంక్షేమ పథకాలతో కేసీఆర్ ను కొట్టలేరు అని ఆయన పేర్కొన్నాడు. కేసీఆర్ ను కొట్టాలంటే.. ఆయన ఇచ్చిన హామీలు వాటి అమలులో ఉన్న తేడాతో కొట్టాలి అని మురళిధర్ రావు అన్నారు.
Read Also: Chandrayaan-3: చంద్రయాన్ ప్రయాణంలో కీలక ఘట్టం.. ల్యాండింగ్‌కు అడుగు దూరంలో..
అన్ని సమయాల్లో సంక్షేమ పథకాలతో ఓట్లు రావు.. తెలంగాణలో యూత్ 65 శాతం.. ఇందులో మెజారిటీ యూత్ కేసీఆర్ కు వ్యతిరేకంగా ఉన్నారు.. పార్లమెంట్ ఎన్నికల తర్వాత అసెంబ్లీ ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లో కేసీఆర్ తిరుగుతున్నారు.. మధ్యప్రదేశ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పోటీ ఇస్తుంది.. కానీ, బీజేపీ గెలుస్తుంది అని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కర్ణాటకలో లాగా మధ్యప్రదేశ్ లో కాంగ్రెస్ హామీలు ఇచ్చినా వారిని ప్రజలు నమ్మరు.. ఎందుకంటే, శివరాజ్ సింగ్ చౌహాన్ వాళ్ళకంటే ఒకడుగు ముందే ఉన్నాడు అని మురళిధర్ రావు తెలిపారు.
Read Also: Pawan Kalyan: ఏపీలో పొత్తులు.. ఎన్డీఏపై పవన్ ఆసక్తికర వ్యాఖ్యలు.. టార్గెట్ అది ఒక్కటే..!
యూత్ గేమ్ చెంజర్లు.. బీఆర్ఎస్ ను ఓడించాలని వాళ్ళు డిసైడ్ అయితే వారి ఓట్లు ఎవరికి పడితే వాళ్లే మొనగాళ్ళు అని మధ్యప్రదేశ్ ఇన్ ఛార్జీ మురళిధర్ రావు అన్నాడు. అవినీతి చేసినోళ్లు అంతా జైలుకు పోవాల్సిందేనని ఆయన తెలిపారు. అందుకే జైళ్లు కడుతున్నామని అన్నారు.. తెలంగాణలో బీజేపీ అధ్యక్షుడి మార్పు కారణంగా పార్టీ డ్యామేజీ అయింది అనడం కరెక్ట్ కాదు.. ఎందుకు మార్చారు అనేది మార్చిన వాళ్లకు బాగా తెలుసు.. నేతలను కలుపుకుపోవడం కోసం పార్టీ బండి సంజయ్ ని తప్పించింది కావచ్చు అని మురళిధర్ రావు చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ పార్టీలో గెలిచిన ఉండరు అనేది ప్రజల్లో నమ్మకం.. దాన్ని పోగొట్టడం ఆ పార్టీకి సాధ్యం కాదు.. ఆ పార్టీ పెద్ద లీడర్ లే పార్టీ మారుతున్నారని ప్రచారం జరుగుతుంది అని ఆయన వ్యాఖ్యనించారు.