Site icon NTV Telugu

Mumbai: ఓ యువతి ఘాతుకం.. ప్రియుడు అందుకు నిరాకరించాడని ఏం చేసిందంటే..!

Mumbai

Mumbai

ముంబైలో ఓ యువతి ఘాతుకానికి పాల్పడింది. న్యూఇయర్ వేడుకల పేరుతో ప్రియుడిని ఇంటికి పిలిచి దుశ్చర్యకు పాల్పడింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితురాలిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపించారు.

అసలేం జరిగిందంటే..
25 ఏళ్ల యువతి.. 47 ఏళ్ల వ్యక్తి ఏడేళ్ల నుంచి ప్రేమించుకుంటున్నారు. అయితే పెళ్లి చేసుకోవాలని చాలా రోజుల నుంచి యువతి ఒత్తిడి చేస్తోంది. కానీ ప్రియుడు తప్పించుకుని తిరుగుతున్నాడు. అయితే న్యూఇయర్ వేడుకల కోసం డిసెంబర్ 31న యువతి ఇంటికి పిలిచింది. ప్రియురాలి పిలుపు మేరకు ఇంటికి వచ్చాడు. దీంతో మరోసారి పెళ్లి ప్రస్తావన తీసుకొచ్చింది. అయితే అందుకు నిరాకరించాడు. దీంతో ఆగ్రహంగా ఉన్న ఆమె పదునైన ఆయుధం తీసుకుని ప్రియుడి ప్రైవేటు భాగాలను కోసేసింది. దీంతో ఒక్కసారిగా విలవిలలాడిపోయాడు. తీవ్ర రక్తస్రావంతో తప్పించుకుని సోదరుడికి సమాచారం అందించాడు. ఘటనాస్థలికి చేరుకున్న సోదరుడు.. హుటాహుటినా బాధితుడ్ని ఆస్పత్రికి తరలించాడు. ప్రస్తుతం వీఎన్ దేశాయ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.

ఇది కూడా చదవండి: Indore Water Tragedy: ఇండోర్‌లో జల విషాదం.. 11 మంది మృతి

అయితే ఈ ఘటనపై బాధిత సోదరుడు పోలీసులకు సమాచారం అందించాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ముంబైలోని శాంతాక్రూజ్ తూర్పు ప్రాంతంలోని జంబ్లిపాడలోని యువతి ఇంట్లో తెల్లవారుజామున ఈ సంఘటన జరిగిందని పోలీస్ అధికారి తెలిపారు. ప్రియుడు పెళ్లికి నిరాకరించడంతో ఈ ఘాతుకానికి పాల్పడిందని వెల్లడించారు. బాధితుడి ప్రైవేటు భాగాల దగ్గర తీవ్ర గాయాలు అయ్యాయని పేర్కొన్నారు. నిందితురాలిని అరెస్ట్ చేసినట్లు చెప్పారు.

ఇది కూడా చదవండి: OTR: పవన్‌పై వైసీపీ మాస్టర్ ప్లాన్..!!

Exit mobile version