NTV Telugu Site icon

IPL 2023: కెప్టెన్సీ మీట్ కు రోహిత్ డుమ్మా.. అభిమానుల్లో ఆందోళన..

Rohit

Rohit

IPL 2023 : ఐపీఎల్-16 ప్రాంరభానికి ముందు పది ఫ్రాంఛైజీల సారథులు ఐపీఎల్ ట్రోఫీతో ఫోటోలకు ఫోజులిచ్చారు. కానీ ముంబై సారథి రోహిత్ మాత్రం ఇందులో లేడు. టీమిండియా సారథి, ఐపీఎల్ లో అత్యంత విజయవంతమైన ముంబై ఇండియన్స్ కెప్టెన్ గా రోహిత్ శర్మకు ఏమింది. ఐపీఎల్ తొలి మ్యాచ్ కు అతడు అందుబాటులో ఉండడం లేదా.. అని ఇప్పుడు ముంబై ఫ్యాన్స్ ఇదే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఐపీఎల్-16 ఓపెనింగ్ కు ముందు అహ్మదాబాద్ వేదికగా నిర్వహించే కెప్టెన్సీ మీట్ లో 9 జట్ల సారథులు మాత్రమే పాల్గొన్నారు.

Also Read : Friday stotram: శుక్రవారం నాడు ఐశ్వర్యం ఇచ్చే శ్రీ మహాలక్ష్మీ స్తోత్రాలు

డిఫెండింగ్ ఛాంపియన్ గా ఉన్న గుజరాత్ కెప్టెన్ హార్థిక్ పాండ్యా, చెన్నై సూపర్ కింగ్స్ ఎంఎస్ ధోనీ, రాజస్థాన్ రాయల్స్ సంజూ శాంసన్, డేవిడ్ వార్నర్ ( ఢిల్లీ క్యాపిటల్స్ ), డూప్లెసిస్( రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ), శిఖర్ ధావన్ ( పంజాబ్ ), నితీశ్ రాణా
( కోల్ కతా).. సన్ రైజర్స్ హైదరాబాద్ సారథి ఎయిడెన్ మార్క్ రమ్ ప్రస్తుతం సౌతాఫ్రికాలోనే ఉన్నాడు. అతడి స్థానంలో భువనేశ్వర్ కుమార్ పాల్గొన్నాడు. కానీ ఈ మీట్ కు ముంబై సారథి రోహిత్ శర్మ రాలేదు. ఎంత బిజీగా ఉన్న ఐపీఎల్ ప్రారంభానికి ముందు జరిగే కెప్టెన్సీ మీట్ లో అన్ని జట్ల సారథూలు పాల్గొంటారు. కానీ రోహిత్ శర్మ రాకపోవడం పలు అనుమానాలకు దారి తీస్తుంది.

Also Read : IPL 2023 : ఐపీఎల్ సమరానికి సిద్ధం.. తొలి పోరులో సీఎస్కే వర్సెస్​ గుజరాత్​..

ఏప్రిల్ 1న చిన్నస్వామి స్టేడియం వేదికగా ముంబై ఇండియన్స్.. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో తొలి మ్యాచ్ ఆడనుంది. మరి ఈ మ్యాచ్ కు రోహిత్ అందుబాటులో ఉంటాడా.. ఉండడా.. అన్నదీ అనుమానంగానే ఉంది. రోహిత్ కు ఏమైనా గాయమైందా.. లేక మరేదైన సమస్య వల్ల ఈ మీటింగ్ ను ఎగ్గొట్టాడా అన్న చర్చ జరుగుతుంది. కాగా ముంబైలో హెడ్ కోచ్ మార్క్ బౌచర్ తో కలిసి విలేకరుల సమావేశంలో రోహిత్ శర్మ పాల్గొన్నాడు. వారు అడిగిన ప్రశ్నలకు ఉత్సహంగానే సమాధానాలు చెప్పాడు. కానీ ఇప్పుడు ఉన్నఫళంగా కెప్టెన్సీ మీట్ కు డుమ్మా కొట్టడానికి గల కారణాలు మాత్రం తెలియడం లేదు.

Show comments