ఆర్థిక రాజధాని ముంబైలో గురువారం మున్సిపల్ ఎన్నికలు జరగనున్నాయి. ఉదయం 7:30 గంటలకు ఎన్నికల పోలింగ్ ప్రారంభం కానుంది. ముంబైతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా 28 మున్సిపల్ కార్పొరేషన్‌లో ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల కోసం అధికారులు ఎన్ని ఏర్పాట్లు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు గట్టి బందోబస్త్ ఏర్పాటు చేశారు.
ఇది కూడా చదవండి: Delhi: రాష్ట్రపతిని కలిసిన అమెరికా రాయబారి సెర్గియా గోర్
ఇక 2017 తర్వాత ముంబైలో ఎన్నికలు జరగడం ప్రాధాన్యత సంతరించుకున్నాయి. అప్పటి నుంచి రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఇక ఈ ఎన్నికల కోసం 20 సంవత్సరాల తర్వాత థాక్రే సోదరులు కలిశారు. ముంబై మేయర్ పదవిని సొంతం చేసుకునేందుకు ఆరాటపడుతున్నారు. ఇంకోవైపు మహాయతి కూటమి కూడా తీవ్రంగా పోటీ ఇస్తోంది. 2022లో ఏక్‌నాథ్ షిండే శివసేన పార్టీని చీల్చి ప్రత్యేకమయ్యారు. ప్రస్తుతం బీజేపీతో కలిసి షిండే వెళ్తున్నారు. ముంబైలో మొత్తం 227 స్థానాలు ఉన్నాయి. ఇక ఎన్నికల ఫలితాలు జనవరి 16న ఉదయం 10 గంటలకు విడుదలకానున్నాయి.
ఇది కూడా చదవండి: AA Loki: బన్నీ – లోకి.. LCU అయితే ఇక ఆపే వాడే లేడు!!
