NTV Telugu Site icon

Father Kills Son: మరో మహిళను పెళ్లి చేసుకునేందుకు.. కన్న కొడుకునే కడతేర్చాడు!

Father Kills Son

Father Kills Son

Father Kills Son: ప్రస్తుత కాలంలో కొందరు వివాహితులు తాత్కాలిక శారీరక సంబంధాల మోజులో పడి కట్టుకున్న వారితో పాటు కన్నవారిని కడతేర్చడానికి కూడా వెనకాడడం లేదు. తాజాగా ఓ వ్యక్తి తన రెండేళ్ల కుమారుడిని దారుణంగా హత్య చేసి.. సాక్ష్యాలను నాశనం చేయాలనే ఉద్దేశంతో మృతదేహాన్ని వాగులో పడేశాడు. ఈ దారుణ ఘటన ముంబైలో చోటుచేసుకుంది. అతను నేరం చేసిన కొన్ని గంటల అనంతరం అరెస్ట్‌ చేసినట్లు పోలీసులు తెలిపారు.

ఇప్పటివరకు జరిపిన విచారణలో.. 22 ఏళ్ల నిందితుడు వివాహేతర సంబంధం కలిగి ఉన్న మహిళను వివాహం చేసుకునేందుకే తన కుమారుడిని హత్య చేసినట్లు పోలీసులు కనుక్కున్నారు. ఎందుకంటే తనను పెళ్లి చేసుకోవాలంటే కుమారుడి అడ్డు తొలగించాలని ఆ మహిళ షరతు పెట్టినట్లు విచారణలో తేలింది. ఆమెను పెళ్లి చేసుకోవాలంటే భార్య, కొడుకును అడ్డు లేకుండా చేయాలని ఆ మహిళ నిందితుడికి చెప్పినట్లు ఓ అధికారి చెప్పారు. ఆ రెండేళ్ల బాలుడి మృతదేహాన్ని కేమ్‌కార్ చౌక్ సమీపంలోని మహిమ్ వాగులో కనుగొన్నట్లు షాహు నగర్ పోలీస్ స్టేషన్ అధికారులు తెలిపారు. ప్లాస్టిక్‌ సంచిలో ఉన్న మృతదేహాన్ని ఎలుకలు కొరికినట్లు పోలీసులు గుర్తించారు. పిల్లాడు కనిపించకపోవడంతో బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఆ తర్వాత పోలీసులు విచారణ చేపట్టారు. బాలుడి బంధువులతో జరిపిన విచారణలో.. అతని తండ్రి ధారవి మురికివాడలో నివసిస్తున్నట్లు పోలీసులు తెలుసుకున్నారు. అనంతరం నిందితుడిని పోలీసులు పట్టుకున్నారు.

Read Also: Vijayawada Crime: ప్రేమికులకు నచ్చజెప్పేందుకు వచ్చాడు.. దారుణ హత్యకు గురయ్యాడు..!

“గార్మెంట్ ఫ్యాక్టరీలో టైలర్‌గా పనిచేస్తున్న నిందితుడికి ఓ మహిళతో వివాహేతర సంబంధం ఉంది.. తనను పెళ్లి చేసుకోవాలంటే తన భార్య, కొడుకును అంతమొందించాలని ఆమె అతడిని కోరిందని, ఆ తర్వాత వారిని చంపేందుకు నిందితులు పథకం పన్నారు. ” అని పోలీసు అధికారి తెలిపారు. చాక్లెట్ ఇస్తానని చెప్పి భార్య దగ్గర నుంచి కొడుకును తీసుకెళ్లి గొంతుకోసి హత్య చేశాడు నిందితుడు. ఆ తర్వాత చిన్నారి మృతదేహాన్ని మహిమ్‌ వాగులో పడేశాడు. నిందితుడిని ఐపీసీ సెక్షన్ 302 (హత్య), 362 (అపహరణ), సంబంధిత ఇతర సెక్షన్ల ప్రకారం అరెస్టు చేశారు.