NTV Telugu Site icon

IPL 2024: హమ్మయ్య.. మొత్తానికి మొదటి విజయం అందుకున్న ముంబై ఇండియన్స్..!

11

11

ఐపీఎల్ 2024 లో భాగంగా జరిగిన 20వ మ్యాచ్ లో నేడు హార్థిక్ పాండే సారధ్యంలోని ముంబై ఇండియన్స్, రిషబ్ పంత్ సారధ్యంలోని ఢిల్లీ క్యాపిటల్స్ తలపడ్డాయి. ఢిల్లీలో జరిగిన ఈ మ్యాచ్లో ఎట్టకేలకు ఈ సీజన్లో ముంబై మొదటి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇకపోతే మొదటగా బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ ఆకాశమే హద్దుగా ఓనర్లు రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్లు చెలరేగారు. ఇందులో భాగంగా 7 ఓవర్లకు 80 పరుగుల భారీ పార్టర్షిప్ తో మొదలైన ఇన్నింగ్స్ ఆ తర్వాత అదే ఊపును అందుకుంది. ముంబై ఇండియన్స్ లో రోహిత్ శర్మ 27 బంతులకు 49 పరుగులు, ఇషాంత్ కిషన్ 23 బంతులతో 42 పరుగులు చేయగా.. ఆ తర్వాత కెప్టెన్ హార్దిక్ పాండ్యా 33 బంతుల్లో 39 పరుగులు, టిమ్ డేవిడ్ 21 బంతుల్లో 45 పరుగులు, చివరలో షెఫర్డ్ 10 బంతులతో 39 పరుగులు సాధించడంతో భారీ స్కోర్ చేసింది. నిర్ణిత 20 ఓవర్లలో ముంబై ఇండియన్స్ 5 వికెట్లు కోల్పోయి 234 భారీ స్కోర్ ని చేయగలిగింది.

Also read: Ranjith Reddy: చేవెళ్ల ప్రజలకు చేయూతనిచ్చిన జ‌నజాత‌ర‌

ఆపై భారీ లక్ష్యంతో బ్యాటింగ్ కు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ మొదట్లోనే తడుబాటుకు గురైంది. హార్థిక్ పాండ్యా బౌలింగ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ 8 బంతుల్లో 10 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. అయితే ఆ తర్వాత చిన్నగా స్కోర్ బోర్డును అభిషేక్ పోరల్, పృద్విషా లు 80 పరుగులకు పైగా పరుగులు జోడించి స్కోర్ బోర్డును పరుగులు పెట్టించారు.

Also read: Rats Eat Ganja: పోలీస్ స్టేషన్‌లో నిల్వ ఉంచిన గంజాయి, భాంగ్ తినేసిన ఎలుకలు.. జార్ఖండ్‌ పోలీసుల నివేదిక..!

ఆ తర్వాత పృథ్వీ షా అవుట్ అయ్యాక క్రీజ్ లోకి వచ్చిన ట్రిస్తాన్ స్తబ్స్ 25 బంతుల్లో ఏకంగా 71 పరుగులు చేసి ఢిల్లీ క్యాపిటల్స్ ను విజయంవైపు వైపు అడుగులు వేశాడు. కాకపోతే., అతనికి తోడుగా ఎవరు క్రీజ్ లో నిలబడకపోవడంతో 20 ఓవర్లు ముగిసే సమయానికి 8 వికెట్లు కోల్పోయి 205 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీనితో ముంబై ఇండియన్స్ జట్టు 29 పరుగుల విజయాన్ని అందుకుంది. ఇకపోతే మ్యాచ్లో రీఎంట్రీ ఇచ్చిన సూర్యకుమార్ యాదవ్ క్రికెట్ అభిమానుల్ని నిరాశపరిచాడు. ఈ మ్యాచ్ లో ఒక్క పరుగు కూడా సాధించకుండా డక్ అవుట్ గా వెనుతిరగాడు.