NTV Telugu Site icon

Mumbai Indians IPL 2025: కొత్త ఫీల్డింగ్ కోచ్‌ని ప్రకటించిన ముంబై ఇండియన్స్

Mi

Mi

Mumbai Indians IPL 2025: ఐదుసార్లు ఐపీఎల్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్ రాబోయే సీజన్‌కు ముందు తన జట్టును మరింత బలోపేతం చేసే క్రమంలో కొత్త ఫీల్డింగ్ కోచ్‌ను నియమించింది. ఈ బాధ్యతను ఇంగ్లండ్‌కు చెందిన అనుభవజ్ఞుడైన కార్ల్ హాప్కిన్సన్‌కు అప్పగించింది. 43 ఏళ్ల హాప్కిన్సన్ ఇంగ్లాండ్ క్రికెట్ జట్టుకు గత 7 సంవత్సరాలుగా ఫీల్డింగ్ కోచ్ గా వ్యవహరించాడు. ఇంగ్లాండ్ సాధించిన రెండు ప్రపంచ కప్ విజయాల్లో ఆయన కీలక పాత్ర పోషించాడు.

Also Read: Marriage Viral: ఒకే కుటుంబంలోని ఆరుగురు అన్నదమ్ములను పెళ్లాడిన ఆరుగురు అక్కాచెల్లెళ్లు

హాప్కిన్సన్ 2019 వన్డే ప్రపంచ కప్, 2022 టీ20 ప్రపంచ కప్‌ ఇంగ్లాండ్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. అతను ఐసీసీ అండర్-19 ప్రపంచ కప్ 2022లో కూడా ప్రధాన ఫీల్డింగ్ కోచ్‌గా పని చేసాడు. ఆ సమయంలో ఇంగ్లాండ్ జట్టు 1998 తర్వాత తొలిసారి ఫైనల్‌కు చేరుకుని రన్నరప్‌గా నిలిచింది. ఈ అనుభవం అతన్ని ముంబై ఇండియన్స్ టీమ్ కోసం సమర్థవంతమైన ఫీల్డింగ్ కోచ్‌గా నిలిపేలా చేసింది. ఇక ముంబై ఇండియన్స్ లో మార్పుల కారణంగా జట్టు ఫీల్డింగ్ కోచ్‌గా 7 సంవత్సరాలుగా ఉన్న జేమ్స్ పామ్‌మెంట్ ఈ బాధ్యతల నుండి తప్పుకున్నాడు. అతని సహకారంతో ముంబై ఇండియన్స్ 2019, 2020 సీజన్లలో విజయాలు సాధించింది. జట్టు విడుదల చేసిన ప్రకటనలో పామ్‌మెంట్‌కు కృతజ్ఞతలు తెలుపుతూ, అతని భవిష్యత్తు ప్రయత్నాలకు శుభాకాంక్షలు తెలియజేశారు.

Also Read: Pat Cummins: యాంకర్‌ ప్రపోజల్‌కు క్రేజీ ఆన్సర్ ఇచ్చిన ఆస్ట్రేలియా కెప్టెన్

మెగా వేలానికి ముందు ముంబై ఇండియన్స్ జట్టు కెప్టెన్ హార్దిక్ పాండ్యాతో పాటు ఐదు మంది ఆటగాళ్లను రిటైన్ చేసింది. ఇక ఐపీఎల్ మెగా వేలంలో మరో 18 మంది కొత్త ఆటగాళ్లను తీసుకుంది. ఈ జాబితాలో న్యూజిలాండ్ పేసర్ ట్రెంట్ బౌల్ట్, దీపక్ చాహర్, విల్ జాక్వెస్, మిచెల్ సాంట్నర్ లాంటి కీలక ఆటగాళ్లు ఉన్నారు. ఈ మార్పులతో ముంబై ఇండియన్స్ జట్టు రాబోయే ఐపీఎల్ సీజన్‌కు మరింత బలంగా తయారవుతోంది. ఫీల్డింగ్‌లో మెరుగైన ప్రదర్శనకు హాప్కిన్సన్ నాయకత్వం కీలకంగా మారనుంది.

Show comments