ఈ ఏడాది ఐపీఎల్ 2025 కోసం ముంబై ఇండియన్స్ కొత్త జెర్సీని విడుదల చేసింది. ఈ సందర్భంగా.. జట్టు కెప్టెన్ హార్దిక్ పాండ్యా అభిమానులకు, జట్టు సభ్యులకు ప్రత్యేకమైన భావోద్వేగ సందేశం ఇచ్చాడు. పాండ్యా, ఇతర ప్లేయర్లు రోహిత్ శర్మ, జస్ప్రీత్ బుమ్రా, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మలతో కలిసి ఫ్రాంచైజీ గర్వించదగ్గ వారసత్వాన్ని నిలబెట్టుకుంటామని ప్రతిజ్ఞ చేశారు. “2025లో ముంబై ఇండియన్స్ సత్తా చాటుతాం. ముంబై ఇండియన్స్ వారసత్వాన్ని కొత్త శిఖరాలకు తీసుకెళ్లే అవకాశం వచ్చింది. నీలం, బంగారు రంగులతో మేము ఈ జట్టుకు గర్వంగా ఉండాలని ఆశిస్తున్నాం. ఇది కేవలం జెర్సీ మాత్రమే కాదు, ఇది మీకు ఇచ్చిన వాగ్దానం. మేము ఎప్పటికప్పుడు మీకోసం అద్భుతమైన ప్రదర్శనను అందిస్తాం. వాంఖడేలో కలుద్దాం!” అని హార్ధిక్ ఓ సందేశం ఇచ్చాడు.
Read Also: Union Bank : బ్యాంక్ జాబ్ కావాలా?.. 2691 పోస్టులు రెడీ.. ఇక వద్దన్నా జాబ్
కొత్త జెర్సీ డిజైన్: ముంబై ఇండియన్స్ జట్టు గుర్తుగా ఉన్న నీలం, బంగారు రంగులు ఈ కొత్త జెర్సీలో కనిపిస్తాయి. నీలం రంగు జట్టులోని నమ్మకం, ఆత్మవిశ్వాసం, సామర్థ్యాన్ని ప్రతిబింబిస్తే.. బంగారు రంగు గర్వం, విజయం, శ్రేష్ఠత కోసం నిరంతర అన్వేషణను సూచిస్తుంది.
Read Also: Hindi Row: ఏ రాష్ట్రంపై ఏ భాషను విధించే ప్రశ్నే లేదు, కానీ.. హిందీ వివాదంపై కేంద్రమంత్రి..
IPL 2025 షెడ్యూల్: భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) ఐపీఎల్ 2025 షెడ్యూల్‌ను ప్రకటించింది. ఈ సీజన్ మార్చి 22న ప్రారంభమవుతుంది. మార్చి 23న ఎంఏ చిదంబరం స్టేడియంలో ముంబై ఇండియన్స్ తమ తొలి మ్యాచ్‌ను చెన్నై సూపర్ కింగ్స్‌తో ఆడనుంది. MI, CSK మధ్య పోటీ అంటే అభిమానులకు ఎంతో పండగ.. కానీ గత కొన్ని సీజన్లలో ముంబై ప్రారంభ మ్యాచ్‌లో గెలవడం లేదు. గత ఐపీఎల్ సీజన్‌లో ముంబై ఇండియన్స్ అభిమానులను నిరాశపరిచింది. కొత్త కెప్టెన్ హార్దిక్ పాండ్యా నేతృత్వంలో జట్టు 14 మ్యాచ్‌లలో నాలుగు మాత్రమే గెలిచింది. పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో నిలిచింది. ఈ సీజన్‌లో జట్టు మంచి ప్రదర్శన చూపించి 6వ ట్రోఫీని గెలవాలని ఆశతో ఉంది.