Site icon NTV Telugu

Mumbai: ఎయిర్‌పోర్టులో ప్రమాదం.. ఫ్లైట్ ఢీకొని 36 ఫ్లెమింగో పక్షుల మృతి

Deeee

Deeee

ముంబై ఎయిర్‌పోర్టులో ప్రమాదం జరిగింది. ఓ విమానం ఢీకొనడంతో 36 ఫ్లెమింగో పక్షులు మృతి చెందాయి. ముంబై-దుబాయ్ ఎమిరేట్స్ విమానం ఢీకొని ఈ పక్షుల చనిపోయాయి. మరిన్ని పక్షుల కోసం ఫారెస్ట్ అధికారులు అన్వేషణ చేస్తున్నారు. ఫ్లైట్‌ ల్యాండ్‌ అయ్యే సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఈ ఘటన సోమవారం రాత్రి ముంబయిలో చోటుచేసుకొంది.

ఇది కూడా చదవండి: KTM Duke Bike: అదిరిపోయే ఫీచర్స్ కేటిఎం కొత్త బైక్ వచ్చేసింది.. ధర ఎంతంటే ?

దుబాయ్‌ నుంచి ముంబైకి వస్తున్న ఎమిరేట్స్‌ విమానం సోమవారం రాత్రి 9:30 గంటల సమయంలో ల్యాండ్‌ కావాల్సి ఉంది. ఈ క్రమంలోనే ఆ వైపుగా ఎగురుతున్న ఫ్లెమింగో పక్షుల గుంపు విమానాన్ని ఢీకొన్నాయి. కాసేపటికి ఎయిర్‌పోర్టులో విమానం ల్యాండ్‌ అయింది. అయితే తీవ్రంగా గాయపడి వివిధ ప్రాంతాల్లో పడిపోయిన పక్షులను గుర్తించిన స్థానికులు అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. ఆ రాత్రి ఆయా ప్రాంతాల్లో 30 పైగా.. మరుసటిరోజు మరికొన్ని పక్షుల కళేబరాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ జాతి పక్షులు ఈ ప్రాంతంలో కనిపించడం అరుదని అధికారులు తెలిపారు.

ఇది కూడా చదవండి: Manish Sisodia: హైకోర్టులో చుక్కెదురు.. సిసోడియా బెయిల్ పిటిషన్ కొట్టివేత

ప్రమాదంపై దర్యాప్తు మొదలుపెట్టిన అధికారులు.. మరణించిన పక్షులకు పోస్టుమార్టం నిర్వహించారు. ఈ ఫలితాలు వచ్చేందుకు నాలుగురోజుల సమయం పట్టే అవకాశం ఉంది. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరపాలంటూ పర్యావరణ కార్యకర్తలు డిమాండ్‌ చేస్తున్నారు.

ఇది కూడా చదవండి: Aadhaar Of Dead Person: అసలు మరణించిన వ్యక్తి ఆధార్ ఏమవుతుందో తెలుసా..

Exit mobile version