Site icon NTV Telugu

Mumbai: రూ.200 చికెన్ షాపు బిల్లుపై ఘర్షణ.. సీఎంవో ప్యూన్ హత్య

Heo

Heo

ముంబైలో దారుణం జరిగింది. రూ.200 చికెన్ బిల్లుపై ఘర్షణ చోటుచేసుకోగా.. ముఖ్యమంత్రి కార్యాలయంలో పని చేస్తున్న ప్యూన్ (30) హత్యకు గురయ్యాడు. మరొకరు గాయాలు పాలయ్యారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఐదుగురు నిందితుల్ని అరెస్ట్ చేశారు.

ఇది కూడా చదవండి: Sandeshkhali: సందేశ్‌ఖాలీ నుంచి పోటీ చేస్తున్న బీజేపీ ఎంపీ అభ్యర్థికి భారీ భద్రత

ముంబైలోని ములుంద్ ప్రాంతంలోని చికెన్ షాపులో బిల్లు చెల్లించే విషయంలో గొడవ జరిగింది. ఇమ్రాన్ ఖాన్(27) అతని సోదరుడు సలీం ఖాన్ (29), మరో ముగ్గురు కలిసి రాడ్లు, పదునైన ఆయుధాలతో అక్షయ్ నర్వేకర్, ఆకాష్ సాబ్లేపై దాడి చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు.. సంఘటనాస్థలికి చేరుకుని బాధితుల్ని ఆస్పత్రికి తరలించగా.. నర్వేకర్ చికిత్స పొందుతూ ప్రాణాలు వదిలాడు. మృతుడు మహారాష్ట్ర ముఖ్యమంత్రి కార్యాలయంలో ప్యూన్‌గా పని చేస్తున్నట్లుగా పోలీసులు గుర్తించారు. ఆదివారం ఉదయం ఆకాష్ సాబ్లేతో కలిసి నర్వేకర్ చికెన్ షాపు దగ్గరకు వెళ్లారు. బిల్లు విషయంలో స్వల్ప ఘర్షణ జరిగింది. తిరిగి రాత్రి మళ్లీ చికెన్ షాపు దగ్గరకు రావడంతో.. అది కాస్తా ముదిరి కొట్టుకునే దాకా వెళ్లింది. ఈ దాడుల్లో నర్వేకర్ మృతిచెందాడు. ఐదుగురు నిందితుల్ని పోలీసులు కోర్టులో హాజరుపరచగా.. మే 8 వరకు పోలీస్ కస్టడీకి న్యాయస్థానం అనుమతి ఇచ్చింది. నిందితుల్ని నుంచి సమాచారం రాబట్టనున్నారు.

ఇది కూడా చదవండి: Amit Shah : అమిత్ షా ఫేక్ వీడియో.. తెలంగాణ కాకుండా మరో రెండు రాష్ట్రాల్లో దర్యాప్తు

Exit mobile version