NTV Telugu Site icon

Syed Mushtaq Ali Trophy: మరోమారు ఛాంపియన్‌గా ముంబై

Syed Mushtaq Ali Trophy

Syed Mushtaq Ali Trophy

Syed Mushtaq Ali Trophy: దేశవాళీ క్రికెట్‌లో తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తూ ముంబై మరోమారు ట్రోఫీని కైవసం చేసుకుంది. సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 ట్రోఫీ ఫైనల్లో శ్రేయాయ్ అయ్యర్ సారథ్యంలోని ముంబై 5 వికెట్ల తేడాతో మధ్యప్రదేశ్‌ను ఓడించి టైటిల్‌ను గెలుచుకుంది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ఆదివారం డిసెంబర్ 15న జరిగిన ఫైనల్లో మధ్యప్రదేశ్ నిర్దేశించిన 175 పరుగుల లక్ష్యాన్ని ముంబై కేవలం 18 ఓవర్లలోనే సాధించింది. ముంబై విజయంలో స్టార్లు సూర్యకుమార్ యాదవ్, యువ ఆల్ రౌండర్ సూర్యాంశ్ షెడ్గే ధనాధన్ ఇన్నింగ్స్ ఆడి జట్టును విజయతీరాలకు చేర్చారు. మధ్యప్రదేశ్‌ కెప్టెన్ రజత్ పాటిదార్ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడినా ఈసారి విజయానికి సరిపోలేదు.

Also Read: Keerthy Suresh Married Antony Thattil: క్రిస్టియన్ పద్ధతిలో మళ్లీ పెళ్లి చేసుకున్న కీర్తి సురేశ్-ఆంటోని..

చిన్నస్వామి స్టేడియంలో జరిగిన ఈ టైటిల్ మ్యాచ్‌లో మధ్యప్రదేశ్ తొలుత బ్యాటింగ్ చేసి మరోసారి కెప్టెన్ రజత్ భారీ స్కోరర్‌గా నిలిచాడు. శార్దూల్ ఠాకూర్ ఆరంభంలో 2 వికెట్లు తీసి వేగంగా బ్యాటింగ్ చేసే అవకాశం మధ్యప్రదేశ్ కి ఇవ్వలేదు. 9వ ఓవర్‌కు 54 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది. 13వ ఓవర్‌లో వెంకటేష్ అయ్యర్‌ను సూర్యన్ష్ షెడ్గే పెవిలియన్‌కు పంపడంతో మధ్యప్రదేశ్ కి పెద్ద షాక్ తగిలింది. క్రీజులో ఉన్న ఎంపీ కెప్టెన్ పాటిదార్ అంచనాలకు తగ్గట్టుగానే ఒంటిచేత్తో జట్టును ఈ పరిస్థితి నుంచి గట్టెక్కించాడు. అతను టోర్నీలో తన ఐదో అర్ధ సెంచరీని సాధించి జట్టును విలువైన స్కోరుకు తీసుకెళ్లాడు. పటీదార్ కేవలం 40 బంతుల్లోనే 81 పరుగుల (6 ఫోర్లు, 6 సిక్సర్లు) అజేయ ఇన్నింగ్స్ ఆడి జట్టును 174 పరుగులకు చేర్చాడు.

ముంబైకి కూడా మంచి ఆరంభం లభించకపోవడంతో మరోసారి ఓపెనర్ పృథ్వీ షా తక్కువ స్కోరుకే ఔటయ్యాడు. అతని తర్వాత అజింక్యా రహానే, కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ పరుగుల వేగాన్ని పెంచారు. అయ్యర్ తన ఇన్నింగ్స్‌ను మరింత ముందుకు తీసుకెళ్లలేకపోయినప్పటికీ, రహానే క్రీజులో కొనసాగాడు. టోర్నీలో ఇప్పటికే అద్భుత ఇన్నింగ్స్‌లు ఆడిన రహానే మళ్లీ జట్టుకు ఆధిక్యాన్ని అందించాడు. ఆయనకు సూర్యకుమార్ యాదవ్ మద్దతు లభించింది. వీరిద్దరూ కలిసి 52 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. అయితే రహానెను వెంకటేష్ అయ్యర్ పెవిలియన్‌కు చేర్చాడు. ఆ తర్వాత 10 బంతుల్లోనే శివమ్ దూబే, సూర్య ఔట్ కావడంతో 14వ, 15వ ఓవర్‌లో ముంబైకి అసలు కష్టాలు ఎదురయ్యాయి. దీంతో ఆ జట్టు 5 వికెట్లు కోల్పోయి 32 బంతుల్లో 46 పరుగులు చేయాల్సి ఉంది.

Also Read: Realme 14x 5G: అద్భుత ఫీచర్లను నమ్మలేని ధరతో స్మార్ట్‌ఫోన్లను తీసుక రాబోతున్న రియల్‌మీ

మధ్యప్రదేశ్ కి పునరాగమనం చేసే అవకాశం ఉంది. కానీ, 21 ఏళ్ల యువ ఆల్‌రౌండర్ సూర్యన్ష్ షెడ్గే మ్యాచ్ పరిస్థితినే మార్చేశాడు. ఈ సీజన్ నుండే తన టీ20 కెరీర్ ను ప్రారంభించిన షెడ్జ్ గత కొన్ని మ్యాచ్ ల్లాగే మరో ధనాధన్ ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 15 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్లతో 36 పరుగులు చేశాడు. అతనితో పాటు అథర్వ అంకోలేకర్ కూడా 6 బంతుల్లో 16 పరుగులు చేశాడు. వీరిద్దరూ కేవలం 19 బంతుల్లోనే 51 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి జట్టును చాంపియన్‌గా నిలిపారు.

Show comments