Air Pollution : దేశ ఆర్థిక రాజధాని ముంబైలో జనాలు గాలి పీల్చుకునేందుకు జనం తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. నగరంలో గాలి నాణ్యత ఎన్నడూ లేనంత దారుణ స్థాయికి పడిపోయింది. దీంతో ప్రజలు తీవ్ర శ్వాసకోశ సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు. గాలి నాణ్యత తగ్గుతున్నా పట్టించుకునే వారే కరువయ్యారు. గత మూడు నెలలుగా గాలి కాలుష్యం క్రమంగా పెరుగుతూనే ఉంది. శ్వాస సమస్యలతో ఆస్పత్రులకు వచ్చే రోగుల సంఖ్య గత వారం రోజుల్లోనే రెట్టింపైంది. నగరంలో ఇప్పుడు జనం జలుబు, తలనొప్పి, గొంతు ఇన్ఫెక్షన్, పొడి దగ్గు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు పడుతున్నారు. మానవ ఆరోగ్యంపై ఈ సమస్యలు దీర్ఘకాలిక ప్రభావాన్ని చూపుతాయని డాక్టర్లు చెబుతున్నారు. రెండేళ్ల క్రితం కరోనాతో తీవ్రంగా ఇబ్బందిపడిన నగరాల్లో ముంబై ఒకటి. ఆ తర్వాత ఈ స్థాయిలో జనం శ్వాసకోశ సమస్యలతో ఇబ్బందులు పడుతుండటం ఇదే ప్రథమంగా చెప్తున్నారు.
Read Also: Bee Attack : పరీక్షలు రాస్తున్న విద్యార్థులపై తేనెటీగల దాడి
ప్రపంచంలో రెండో అత్యంత కలుషిత నగరంగా ముంబై నిలిచింది. మన దేశంలో మోస్ట్ పొల్యూటెడ్ సిటీ కూడా ఇదే. స్విట్జర్లాండ్ కు చెందిన ఎయిర్ క్వాలిటీ మానిటరింగ్ సంస్థ ‘ఐక్యూ ఎయిర్’ తాజాగా నిర్వహించిన వీక్లీ సర్వేలో ఈవివరాలు వెల్లడయ్యాయి. జనవరి 29 నుంచి ఫిబ్రవరి 8 మధ్యకాలంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రధాన నగరాల గాలి నాణ్యతను తనిఖీ చేసి ఎయిర్ ట్రాకింగ్ఇండెక్స్ను ఐక్యూ ఎయిర్ రూపొందించింది. ఇంతకుముందు వరకు దేశంలో అత్యంత కలుషిత నగరంగా ఢిల్లీ ఉండగా.. ఇప్పుడా స్థానంలోకి ముంబై వచ్చింది. ఆశ్చర్యకరంగా ఈసారి కలుషిత నగరాల టాప్10 లిస్టులో ఢిల్లీ పేరు లేదు.