NTV Telugu Site icon

APSRTC: ఏపీలో మల్టీసిటీ జర్నీ రిజర్వేషన్‌.. ఒకే టికెట్‌పై రెండు బస్సుల్లో ప్రయాణం

Apsrtc

Apsrtc

APSRTC: ఏపీఎస్ ఆర్టీసీ వినూత్న ప్రయోగం చేపట్టింది. ఒకే టికెట్‌పై రెండు బస్సుల్లో ప్రయాణించే సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకొస్తోంది. దూరప్రాంత ప్రయాణికుల సౌకర్యార్థం ఏపీఎస్‌ఆర్టీసీ కొత్తగా మల్టి సిటీ జర్నీ రిజర్వేషన్‌ వ్యవస్థను అందుబాటులోకి తెచ్చింది. ‘మల్టీ సిటీ జర్నీ రిజర్వేషన్’ పేరిట తీసుకొచ్చిన ఈ విధానంలో ఒకే టికెట్‌పై రెండు బస్సుల్లో ప్రయాణించి గమ్యస్థానాన్ని చేరుకోవచ్చు. ప్రయాణికుడు చేరుకోవాల్సిన గమ్యస్థానానికి నేరుగా బస్సు లేనప్పుడు మధ్యలో ఓ ప్రాంతంలో దిగి అక్కడి నుంచి మరో బస్సులో ప్రయాణించి వెళ్లాల్సిన చోటుకు చేరుకోవచ్చు.

Read Also: One Side Love : వన్ సైడ్ లవ్ యువతి ప్రాణం తీసిందిగా

రెండు బస్సుల్లో ప్రయాణానికి ఒకేసారి ముందస్తుగా ఆర్టీసీ వెబ్‌సైట్‌ లేదా యాప్‌ ద్వారా టికెట్‌ రిజర్వేషన్‌ చేసుకోవచ్చు. రాయితీలు యథాతథంగా వర్తిస్తాయని, ఎలాంటి మార్పు ఉండదని అధికారులు తెలిపారు. తొలి బస్సు నుంచి దిగిన తర్వాత 2 నుంచి 22 గంటల వ్యవధిలో రెండో బస్సు ఎక్కి ప్రయాణించాల్సి ఉంటుందని తెలిపారు. తొలి దశలో 137 దూర ప్రాంత బస్సు రూట్లలో ఈ విధానం అమలు చేస్తున్నట్టు తెలిపారు. యూటీఎస్ మొబైల్ యాప్ ద్వారా కానీ, ఆర్టీసీ ఆన్‌లైన్ పోర్టల్ ద్వారా కానీ రిజర్వేషన్లు చేసుకోవచ్చు. ఒకటి రెండు రోజుల్లోనే దీనిని ప్రారంభించనున్నారు. కాగా, ‘మల్టీ సిటీ జర్నీ రిజర్వేషన్’ను అందుబాటులోకి తీసుకొస్తున్న తొలి సంస్థగా ఏపీఎస్ఆర్టీసీ రికార్డులకెక్కనుంది.

Show comments