Site icon NTV Telugu

Fake Liquor: ములకలచెరువు నకిలీ మద్యం తయారీ కేసులో ట్విస్ట్..

Ap

Ap

Twist in Mulakalacheruvu Fake Liquor Case: ములకలచెరువు నకిలీ మద్యం తయారి కేసులో ట్విస్ట్ నెలకొంది. నిందితుడు జనార్దన్ వైసీపీకి చెందిన రాంమోహన్ గోడన్ ను అద్దెకు తీసుకోని మద్యం తయారీ యూనిట్ ఏర్పాటు చేసినట్లు తేలింది. గూడుపల్లికి చెందిన రాంమోహన్ వైసీపీలో యాక్టివ్ కార్యకర్త.. గతంలో అర్ కె డాబా పేరుతో హోటల్ నిర్వహించాడు. హైవే మార్పు చేయడంతో హోటల్ కు కష్టమర్లు రాకపోవడంతో మూసివేశాడు. జయచంద్రారెడ్డి సూచనతో అద్దెపల్లికి దాన్ని అద్దెకు ఇచ్చాడు. మరోవైపు.. తనకు ఎలాంటి సంబంధం లేదని తనపై వచ్చిన ఆరోపణలను కొట్టి పారేస్తూ.. కడిగిన ముత్యంలా బయటకు వస్తానని అని టీడీపీ ఇన్‌ఛార్జీ జయచంద్రారెడ్డి వీడియో విడుదల చేశాడు.

READ MORE: Nellore: నెల్లూరులో డబుల్ మర్డర్ కలకలం.. పెన్నా బ్యారేజ్‌లో మృతదేహాలు..

మరోవైపు.. రాష్ట్రవ్యాప్తంగా కలకలం సృష్టించిన ములకలచెరువు నకిలీ మద్యం కేసులో రెండో ప్రధాన నిందితుడు కట్టా నాగరాజును మంగళవారం అరెస్ట్‌ చేసినట్టు ఎక్సైజ్‌ అసిస్టెంట్‌ కమిషనర్‌ చంద్రశేఖర్‌రెడ్డి తెలిపారు. విజయవాడ సమీపంలో ఇబ్రహీంపట్నంకు చెందిన నాగరాజు ములకలచెరువు నకిలీ మద్యం తయారీ ప్లాంట్‌లో కూలీలను సమకూర్చడంతోపాటు నకిలీ మద్యం రవాణా తదితర కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్టు గుర్తించామన్నారు. మిగిలిన నిందితులను అరెస్ట్‌ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు ఎక్సైజ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ సీఐ నీలకంఠేశ్వరరెడ్డి ఫిర్యాదు మేరకు ఎక్సైజ్‌ సీఐ హిమబిందు కేసు నమోదు చేశారు. కేసు దర్యాప్తులో భాగంగా మరో ఇద్దరిని వేరుగా అరెస్ట్‌ చేశారు.

READ MORE: Megastar : క్లాస్ లుక్ లో మన ‘మెగాస్టార్’ చిరు లేటెస్ట్ ఫొటోస్

Exit mobile version