బంగారు ప్రియులకు విశిష్ట సేవలు అందిస్తున్న ‘ముకుంద జ్యువెల్లర్స్’ షోరూం విజయవంతంగా నడుస్తుంది. మంగళవారం (18)వ తేదీన రెండో సంవత్సరంలోకి అడుగుపెట్టబోతుంది. ఈ సందర్భంగా బేగంపేటలో 2వ వార్షికోత్సవం వేడుకలను ఘనంగా నిర్వహించనున్నట్లు యాజమాన్యం తెలిపింది. వేదిక Arora Banquets, ఫస్ట్ ఫ్లోర్, లైఫ్ స్టైల్ బిల్డింగ్, బేగంపేటలో సెలబ్రేషన్స్ చేయనున్నారు.
Read Also: Unesco: యునెస్కో తాత్కాలిక జాబితాలో మరో 6 ప్రదేశాలు.. తెలంగాణలో ఆ ప్రాంతం
కాగా.. ముకుంద జ్యువెల్లర్స్ షోరూములు కూకట్‌పల్లి, కొత్తపేట్, ఖమ్మం, సోమాజిగూడ, హనుమకొండలలో బ్రాంచ్‌లను కలిగి ఉంది. తక్కువ ఖర్చు, ఎక్కువ పొదుపుతో ఆభరణాలను కొనుగోలు చేసేలా అద్భుతమైన ఆఫర్లను అందిస్తూ కస్టమర్లను ఆకర్షిస్తూ విజయవంతంగా దూసుకుపోతుంది. ముకుంద జ్యువెలర్స్ తమ స్టోర్‌లో అద్భుతమైన కలెక్షన్లతో పాటు ప్రత్యేకమైన డిజైన్లను అందుబాటులో ఉంచింది. అలాగే.. డైమండ్ రింగ్‌లు, నెక్లెస్‌లు, బ్రాస్‌లెట్‌లు మొదలైన అధిక నాణ్యత గల ఆభరణాలను ఈ స్టోర్ అందిస్తోంది. ముకుంద జ్యువెలర్స్ సంస్థ తన వినూత్న డిజైన్లతో బ్రాండ్‌ను పెంచుకుంటూ దూసుకెళ్లిపోతుంది. సాంప్రదాయ భారతీయ డిజైన్‌ల నుండి ఆధునిక, సమకాలీన శైలుల వరకు వివిధ రకాల ఆభరణాలను అందిస్తోంది. అదనంగా, ఆకర్షణీయమైన ఆభరణాల ఎంపికతో పాటు, గ్లామర్ జెమ్స్ కస్టమ్ డిజైన్ సేవలను కూడా అందిస్తోంది.
Read Also: TTD: తెలంగాణ ప్రజాప్రతినిధులకు శుభవార్త.. సిఫార్సు లేఖలపై టీటీడీ కీలక నిర్ణయం