NTV Telugu Site icon

Mukesh Kumar Debut: వికెట్ ఏమీ పడగొట్టకున్నా.. రెండో భారత ఆటగాడిగా ముఖేష్‌ కుమార్‌ అరుదైన రికార్డు!

Mukesh Kumar

Mukesh Kumar

Mukesh Kumar Becomes Second Indian to Rare Achievement: భారత పేసర్‌ ముఖేష్‌ కుమార్‌ అరుదైన అరుదైన రికార్డు నెలకొల్పాడు. ఒకే టూర్‌లో మూడు ఫార్మాట్‌లలో అరంగేట్రం చేసిన రెండో భారత ఆటగాడిగా రికార్డుల్లో నిలిచాడు. గురువారం రాత్రి ట్రినిడాడ్‌ వేదికగా వెస్టిండీస్‌తో జరిగిన తొలి టీ20లో ఆడిన ముఖేష్‌.. ఈ అరుదైన ఫీట్‌ను తన పేరుపై లిఖించుకున్నాడు. ఇదే పర్యటనలో ముఖేష్‌ వెస్టిండీస్‌పై టెస్టు, వన్డే అరంగేట్రం చేసిన విషయం తెలిసిందే. ఐపీఎల్ 2023లో రాణించిన ముఖేష్‌కు భారత జట్టులో చోటుదక్కింది.

ఒకే టూర్‌లో మూడు ఫార్మాట్‌లలో అరంగేట్రం చేసిన మొదటి ఆటగాడిగా టీమిండియా పేసర్‌ తంగరసు నట్‌రాజన్‌ ఉన్నాడు. 2021లో ఆస్ట్రేలియా పర్యటనలో మూడు ఫార్మాట్‌లలో అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. నట్‌రాజన్‌ ఆసీస్ గడ్డపై టెస్టు, వన్డే మరియు టీ20 అరంగేట్రం చేశాడు. ఇపుడు విండీస్‌ గడ్డపై ముఖేష్‌ కుమార్‌ కూడా టెస్టు, వన్డే మరియు టీ20ల్లో అరంగేట్రం చేశాడు.

తొలి టీ20లో3 ఓవర్లు బౌలింగ్‌ చేసిన ముఖేష్‌ ​కుమార్‌.. 24 పరుగులు ఇచ్చి ఒక వికెట్ కూడా పడగొట్టలేదు. అయితే విండీస్‌తో జరిగిన మూడో వన్డేలో అద్బుతమైనతో ఆకట్టుకున్నాడు. మూడు కీలక వికెట్లు తీసి భారత జట్టు విజయంలో తన వంతు పాత్ర పోషించాడు. అంతకుముందు ఆడిన ఓ టెస్టులో 2 వికెట్స్ తీశాడు. ఇప్పటివరకు ఐదు మ్యాచులు ఆడిన అతడు 6 వికెట్స్ తీశాడు. ఇక తొలి టీ20లో భారత్ 4 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. 150 పరుగుల లక్ష్య ఛేదనలో నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 145 పరుగులు మాత్రమే చేసింది.

Also Read: Andy Flower RCB Coach: ఆర్‌సీబీ హెడ్‌ కోచ్‌గా జింబాబ్వే మాజీ క్రికెటర్.. ఇక కప్పు ఖాయం!