Site icon NTV Telugu

Kokilaben Ambani: అనారోగ్యానికి గురైన ముఖేష్ అంబానీ తల్లి కోకిలాబెన్.. హెలికాప్టర్ లో ఆసుపత్రికి తరలింపు

Kokila Ben

Kokila Ben

రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత, దేశంలోనే అత్యంత సంపన్నుడైన ముఖేష్ అంబానీ తల్లి కోకిలాబెన్ అనారోగ్యానికి గురైనట్లు సమాచారం. ఆమె ఆరోగ్యం క్షీణించినట్లు వార్తలు వస్తున్నాయి. కోకిలాబెన్ ఈ ఉదయం హెచ్ఎన్ రిలయన్స్ ఆసుపత్రిలో చేరినట్లు చెబుతున్నారు. ముఖేష్, అనిల్ అంబానీల తల్లి కోకిలాబెన్‌ను( 91 ఏళ్లు) హెచ్‌ఎన్ రిలయన్స్ ఆసుపత్రిలో చేర్పించినట్లు సమాచారం. మీడియా నివేదికల ప్రకారం, కోకిలాబెన్ ఆరోగ్యం అకస్మాత్తుగా క్షీణించిందని, ఆ తర్వాత ఆమెను అత్యవసర పరిస్థితిలో హెలికాప్టర్ ద్వారా ఆసుపత్రికి తరలించినట్లు తెలుస్తోంది. కాగా అంబానీ కుటుంబం లేదా ఆసుపత్రి వర్గాలు ఇంకా ఎటువంటి అధికారిక ప్రకటన విడుదల చేయలేదు. కొంత కాలంగా కోకిలా బెన్ వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆరోగ్యం క్షీణించినట్లు తెలుస్తోంది.

Exit mobile version