Site icon NTV Telugu

Mukesh Ambani-Virat Kohli: అంబానీ సర్.. మీరు విరాట్ కోహ్లీని కొనలేరు!

Mukesh Ambani Virat Kohli

Mukesh Ambani Virat Kohli

Virat Kohli Fan Instagram Reel Goes Viral: అపర కుబేరుడు ముఖేశ్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ, ఫార్మా దిగ్గజం వీరేన్‌ మర్చంట్‌ కుమార్తె రాధిక మర్చంట్‌ల వివాహం జులై 12న అంగరంగ వైభవంగా జరిగిన విషయం తెలిసిందే. ముంబైలోని జియో వరల్డ్‌ సెంటర్‌లో జరిగిన ఈ వివాహానికి వ్యాపార, సినీ, క్రీడా రంగాలకు చెందిన అతిరథ మహారథులు హాజరయ్యారు. టీమిండియా క్రికెటర్లు చాలామంది అనంత్-రాధికల పెళ్లికి హాజరైనా.. ‘కింగ్’ విరాట్ కోహ్లీ మాత్రం హాజరుకాలేదు.

ముంబై ఇండియన్స్ ప్లేయర్స్ రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్యా, సూర్యకుమార్ యాదవ్.. టీమిండియా ఆటగాళ్లు రిషబ్ పంత్, కేఎల్ రాహుల్.. భారత మాజీ ప్లేయర్స్ సచిన్ టెండ్యూలర్, ఎంఎస్ ధోనీ ఇలా చాలామంది అనంత్ అంబానీ-రాధిక మర్చంట్‌ల వివాహంలో సందడి చేశారు. అయితే ఈ పెళ్లికి టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ మాత్రం రాలేదు. టీ20 ప్రపంచకప్ 2024 అనంతరం లండన్‌లో తన కుటుంబాన్ని కలిసేందుకు వెళ్లాడు. అంబానీ ఇంట్లో పెళ్లికి విరాట్ పెద్దగా ప్రాధాన్యత ఇవ్వలేదు. దాంతో సోషల్ మీడియాలో విరాట్ ఫాన్స్ జోకులు పేల్చుతున్నారు. ‘ముఖేశ్ అంబానీ సర్.. మీరు ఎన్ని కోట్లు ఖర్చు చేసినా మా విరాట్ కోహ్లీని కొనలేరు’ అని ఓ అభిమాని ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ రిల్ చేశాడు. ఆ రీల్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Also Read: Yashasvi Jaiswal Record: టీ20ల్లో కనివినీ ఎరుగని రికార్డు.. మన యశస్వి జైస్వాల్ సొంతం!

గత ఫిబ్రవరి 15న విరాట్ కోహ్లీ సతీమణి, బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మ అకాయ్‌కు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. అప్పటినుంచి ఆమె అక్కడే ఉంటున్నారు. ఐపీఎల్ 2024 కోసం భారత్ వచ్చిన విరాట్.. టీ20 ప్రపంచకప్ 2024 వరకు బిజీగా గడిపాడు. దాదాపుగా మూడు నెలలు కుటుంబానికి దూరంగా ఉన్న కింగ్.. ముఖేశ్ అంబానీ నుంచి పిలుపొచ్చినా పిల్లలను చూసేందుకు లండన్‌కు వెళ్ళాడు. టీ20 ప్రపంచకప్ 2024 ఫైనల్లో కోహ్లీ హాఫ్ సెంచరీ చేసిన విషయం తెలిసిందే.

Exit mobile version