Mukesh Ambani: మార్కెట్లో జియో ప్లాట్‌ఫారమ్స్ షేర్ల అరంగేట్రం అంబానీ కుటుంబంలో ఎంతో భావోద్వేగ క్షణాలకు వేదికైంది. మార్కెట్ ఒడిదుడుకులతో సంబంధం లేకుండా జరిగిన ఈ ఘనమైన లిస్టింగ్ వేడుకలో కుటుంబసభ్యులంతా ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కొడుకు అనంత అంబానీ మాట్లాడుతుండగా, ముఖేష్ అంబానీ సంతోషంతో కన్నీటిపర్యూతమయ్యారు. జియో ప్లాట్‌ఫారమ్స్ స్టాక్ మార్కెట్ ఎంట్రీ తర్వాత నిర్వహించిన వేడుకలో రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముఖేష్ అంబానీ ఒక్కసారిగా భావోద్వేగానికి గురయ్యారు. తన పిల్లలు ఆకాశ్ అంబానీ, అనంత అంబానీ, ఈశా అంబానీ వేదికపై మాట్లాడిన మాటలు ఆయనను కంటతడి పెట్టించాయి. రిలయన్స్ ప్రయాణాన్ని, జియో వెనుక ఉన్న జ్ఞాపకాలను వారు గుర్తుచేసుకుంటున్న సమయంలో ముఖేష్ అంబానీ కంట కన్నీళ్లు తుడుచుకోవడం కనిపించింది.
ఈ వేడుకలో అనంత అంబానీ మాట్లాడుతూ.. జియో ప్లాట్‌ఫారమ్స్‌కు దేశవ్యాప్తంగా అద్భుతమైన ఆశీర్వాదాలు లభించాయన్నారు. ఈ కలకి ఈశా దీదీ బీజం వేస్తే, ఆకాశ్ అన్న దాన్ని తన నిజమైన కలగా మలచుకున్నాడని తెలిపారు. అమ్మ ఏమో ‘జియో నా లాలా’ అంది, నాయనమ్మ ‘జుగ్ జుగ్ జియో’ అని దీవించిందని, స్నేహితులు మాత్రం ‘జియో యార్’ అన్నారని గుర్తుచేశారు. వాస్తవానికి జియోను దేశ ప్రజలే సృష్టించారని, ప్రజల కలలను సాకారం చేయడమే తమ ధ్యేయమని అనంత చెప్పారు. కొడుకు ఈ మాటలు చెబుతున్న సమయంలో ముఖేష్ అంబానీ భావోద్వేగంతో కన్నీటిని ఆపుకోలేకపోయారు.
అనంత్ అంబానీతోపాటు రిలయన్స్ నాన్-ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఈశా అంబానీ ప్రసంగం కూడా ఆకట్టుకుంది. జియో విజయానికి కారణమైన బృందానికి, తన అన్నదమ్ములకు, అమ్మానాన్నలకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. ఇతరులు ఊహించని భవిష్యత్తును తన తండ్రి ముఖేష్ అంబానీ ముందే చూశారని, అందరూ అసాధ్యం అన్న దానిని సుసాధ్యం చేసే ధైర్యం ఆయన చూపించారని ఈశా పేర్కొన్నారు. కోట్లాది మంది భారతీయులు ఆయన దూరదృష్టిలో కొత్త అవకాశాలను చూశారంటూ, ఇది కేవలం ఆరంభం మాత్రమేనని స్పష్టం చేశారు. తన సోదరుడు ఆకాశ్ గత పదమూడేళ్లుగా ఈ ప్రయాణంలో ఉన్నాడని, కనీసం ఒక్క రోజూ కూడా అర్ధరాత్రి దాటకుండా ఇంటికి రాలేదని చెబుతూ.. తనకు ఆకాశ్ చెల్లెలుగా ఉండటం గర్వంగా ఉందని ఈశా చెప్పుకొచ్చారు.
Speech by Shri Anant Ambani, Director, Jio Platforms, at the listing ceremony of JPL IPO https://t.co/KiShhOhJnV
— Reliance Industries Limited (@RIL_Updates) October 28, 2026

