NTV Telugu Site icon

Reliance AGM 2024: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. రిలయన్స్ లో 30 వేల ఉద్యోగాలు? అంబానీ ప్రకటన..

Ambani

Ambani

ముఖేష్ అంబానీ నేతృత్వంలోని.. దేశంలోనే అత్యంత విలువైన కంపెనీ రిలయన్స్ ఇండస్ట్రీస్ 47వ వార్షిక సర్వసభ్య సమావేశం (ఏజీఎం) ప్రారంభమైంది. మధ్యాహ్నం 2 గంటలకు ముఖేష్ అంబానీ అడ్రస్‌తో ప్రారంభం కాగానే.. రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లలో వృద్ధి కనబడింది. రెండు శాతానికి పైగా షేర్లు పెరిగాయి. ఈ సమావేశంలో.. రిలయన్స్ గ్రూప్ రిలయన్స్ జియో, రిలయన్స్ రిటైల్ అనే రెండు కంపెనీల ఐపీఓకి సంబంధించిన చిత్రాన్ని రిలయన్స్ ఛైర్మన్ చూయించారు. ఉపాధి అవకాశాలను పెంపొందించడంపై సంస్థ దృష్టి సారించిందని, గతేడాది కొత్తగా 1.7 లక్షల ఉద్యోగాలు కల్పించామని ఛైర్మన్ అంబానీ చెప్పారు.

READ MORE: Abudhabi Prince: వచ్చే నెలలో అబుదాబి యువరాజు భారత్‌లో పర్యటన..!

ముఖేష్ అంబానీ ఇంకా మాట్లాడుతూ .. ఫుడ్ ప్రొవైడర్‌ను ఎనర్జీ ప్రొవైడర్‌గా మార్చడమే తమ లక్ష్యం అని, కంపెనీ నిరంతరం బయో ఎనర్జీ వ్యాపారంపై దృష్టి సారిస్తోందని అన్నారు. 2025 నాటికి 55 కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్లు ఏర్పాటు చేస్తామని, బయో ఎనర్జీ వ్యాపారం ద్వారా దాదాపు 30 వేల మందికి ఉద్యోగావకాశాలు కల్పిస్తామని చెప్పారు. రిలయన్స్ ఛైర్మన్ జామ్‌నగర్‌లో బయో ఎనర్జీ డీప్ టెక్ సెంటర్‌ను ఏర్పాటు చేయడం గురించి, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరి నాటికి సోలార్ పివి వ్యాపారంలోకి ప్రవేశించడంపై ఆయన మాట్లాడారు.

READ MORE: Shakeela: బికినీలో షకీలా.. మేకప్ మ్యాన్ అసభ్య ప్రవర్తన.. సంచలన విషయాలు వెలుగులోకి

కాగా.. జియో యొక్క భవిష్యత్తు ప్రణాళికల గురించి మాట్లాడుతూ.. దీపావళి నుంచి జియో ఏఐ (Jio AI) క్లౌడ్ వెల్‌కమ్ ఆఫర్‌ను ప్రారంభించనున్నట్లు ఆకాష్ అంబానీ తెలిపారు. జియో హోమ్ (Jio Home) కి కొత్త ఫీచర్లు కూడా జోడించబడ్డాయన్నారు. ఏఐ ద్వారా జియో సెటప్ బాక్స్‌ను ఉపయోగించడం మరింత సులభం అవుతుందని తెలిపారు. హలో జియో ద్వారా సెటప్ బాక్స్‌ను రన్ చేయడం సులభంగా మారుతుందన్నారు. సెటప్ బాక్స్‌లో జియో టీవీ ఓఎస్‌ని లాంచ్ చేశామని చెప్పారు.