NTV Telugu Site icon

Mukarram Jah: హైదరాబాద్ చేరుకున్న నిజాం ప్రిన్స్ ముకర్రమ్ మృతదేహం

Mukarram Jah

Mukarram Jah

Mukarram Jah: హైదరాబాద్‌కు చెందిన నిజాం ముకర్రం జా బహదూర్ టర్కీలోని ఇస్తాంబుల్ లో మృతిచెందారు. ఒకప్పుడు మన దేశంలోనే అత్యంత సంపన్నుడిగా ఉన్న ముకర్రమ్ ఝా ఇస్తాంబుల్ లో ఒక అద్దె ఇంట్లో మృతి చెందడం బాధాకరం. మరోవైపు ఆయన మృతదేహం టర్కీ నుంచి హైదరాబాద్ కు చేరుకుంది. ఇస్తాంబుల్ నుంచి ఆయన భౌతికకాయాన్ని ప్రత్యేక విమానంలో తీసుకొచ్చారు. అక్కడి నుంచి చౌమొహల్లా ప్యాలెస్ కు తరలించారు.

Read Also:TSRTC: ప్రయాణికులకు ధన్యవాదాలు తెలిపిన టీఎస్ ఆర్టీసీ ఎండీ సజ్జనార్

ఈరోజు ఆయన భౌతికకాయాన్ని చూడటానికి కేవలం నిజాం కుటుంబీకులు, బంధువులకు మాత్రమే అనుమతిని ఇచ్చారు. రేపు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఆయన పార్థివదేహాన్ని చూసేందుకు ప్రజలకు అనుమతిని ఇస్తారు. రేపు మధ్యాహ్నం ముకర్రమ్ అంతిమ యాత్ర ప్రారంభమవుతుంది. చార్మినార్ పక్కన ఉన్న మక్కా మసీదు వరకు అంతిమ యాత్ర కొనసాగుతుంది. అక్కడున్న ఆయన పూర్వీకులైన నిజాం (అసఫ్ జాహీలు)ల సమాధుల పక్కనే ముకర్రమ్ పార్థివ దేహాన్ని ఖననం చేస్తారు. శనివారం రాత్రి 89 ఏళ్ల ముకర్రమ్ ఝా ఇస్తాంబుల్ లో కన్నుమూశారు.

Read Also: State Planning Commission: పార్లమెంటరీ గ్రూప్ తరహాలోనే.. పంచాయతీరాజ్ గ్రూప్

ఉస్మాన్‌ అలీఖాన్‌ పెద్దకుమారుడైన అజమ్‌ కు ముకర్రం జా 1933లో జన్మించారు. ఇతడిని అందరూ ప్రిన్స్ ఆఫ్ హైదరాబాద్ అని పిలిచేవారు. చివరి నిజాం ఉస్మాన్‌ అలీఖాన్‌కు ఇద్దరు కుమారులు ఉన్నా.. ముకర్రం జాను 8వ నిజాంగా ప్రకటించారు. అయితే 1971లో భారత ప్రభుత్వం రాజాభరణాలు రద్దు చేసింది. దీంతో చివరి నిజాం రాజాభరణం రద్దైంది. చివరి నిజాంకు నలుగురు భార్యలు ఉన్నారు. ప్రపంచలోనే కుబేరుడిగా ఉస్మాన్ అలీఖాన్ అప్పట్లో గుర్తింపు పొందారు. ఆయన వారసుడిగా వచ్చిన ముకర్రం జా కూడా కుబేరుడయ్యారు. కానీ విలాసాలకు అలవాటు పడి.. దివాలా తీశారు. కుటుంబ విభేదాలు.. ఆస్తి వివాదాలతో ఉన్నదంతా పోగొట్టుకున్నారు. హైదరాబాద్ లో నిజాం వారసులు సైతం కోర్టుకెక్కారు. ఇక్కడి ఆస్తులను అమ్మడానికి వీల్లేదని.. కోర్టు ఆంక్షలు విధించింది. చివరికి ఇస్తాంబుల్‌లోని ఓ డబుల్‌ బెడ్‌రూమ్‌ కే చివరి నిజాం పరిమితమయ్యారు. చివరి నిజాం మృతిపై సీఎం కేసీఆర్ సంతాపం తెలిపారు. ఆయన మృతి పట్ల వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. నిజాం చేసిన సామాజిక సేవలకు గుర్తుగా అంత్యక్రియలను ఘనంగా నిర్వహిస్తామని తెలిపారు.

Show comments