NTV Telugu Site icon

Mudragada Padmanabham: ఈ నెల 14న వైసీపీలో చేరనున్న ముద్రగడ పద్మనాభం

Mudragada Padmanabham

Mudragada Padmanabham

Mudragada Padmanabham: ఎన్నికల వేళ ఏపీలో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కాపు ఉద్యమ నాయకుడు ముద్రగడ పద్మనాభం వైసీపీలో చేరేందుకు సిద్ధమవుతున్నారు. ఎన్నికల్లో పోటీ చేయడంపై స్పష్టత రాకున్నా వైసీపీలో చేరడానికి సుముఖత వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. ఈ నెల 14న ముద్రగడ పద్మనాభం వైసీపీలో చేరనున్నట్లు తెలిసింది. తాడేపల్లిలో సీఎం సమక్షంలో ముద్రగడ వైసీపీ కండువా కప్పుకోనున్నారు. కిర్లంపూడి నుంచి తాడేపల్లి ర్యాలీగా వెళ్లి వైసీపీలోకి జాయినింగ్ ఉంటుందని అనుచరులకు ముద్రగడ పద్మనాభం క్లారిటీ ఇచ్చారు. ముద్రగడ పద్మనాభంతో పాటు ఆయన కుమారుడు గిరి కూడా వైసీపీలో చేరనున్నారు.

Read Also: Medarametla Siddham Meeting: మేదరమెట్లలో వైసీపీ సభకు సర్వం ‘సిద్ధం’.. సీఎం ప్రసంగంపై ఉత్కంఠ

కాపు ఉద్యమ నేతగా గుర్తింపు పొందిన ముద్రగడ పద్మనాభం నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ప్రత్తిపాడు నియోజక వర్గం నుంచి ముద్రగడ నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 1978, 1983, 1985,1989 ఎన్నికల్లో ముద్రగడ పద్మనాభం ఎమ్మెల్యేగా గెలిచారు. 1978లో జనతా పార్టీ నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన ముద్రగడ, 1983, 1985లో టీడీపీ తరపున పోటీ చేసి గెలిచారు. 1989లో కాంగ్రెస్‌ పార్టీ నుంచి గెలుపొందారు. 1994లో పోటీ చేసి ఓడిపోయారు. ప్రత్తిపాడు నియోజక వర్గం లో ముద్రగడ కుటుంబం ఆరుసార్లు గెలుపొందింది. పద్మనాభం ఓ సారి ఎంపీగా కూడా గెలిచారు. ఎన్టీఆర్, చెన్నారెడ్డి మంత్రివర్గాల్లో పనిచేశారు. 1994లో కాంగ్రెస్‌ పార్టీ తరపున పోటీ చేసిన ఓడిపోయిన ముద్రగడ 1999లో టీడీపీ తరపున ఎంపీగా గెలిచారు. ఆ తర్వాత 2009లో కాంగ్రెస్ పార్టీ తరపున పిఠాపురంలో పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 2009 లో కాంగ్రెస్ తరపున పిఠాపురం నుంచి పోటీ చేసి మూడో స్థానంలో ఉన్నారు ముద్రగడ. అప్పటి నుంచి క్రియా‎శీల రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. కాపు రిజర్వేషన్ల కోసం టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో ఉద్యమించారు.ఆ తర్వాత కాలంలో ఆయన ఏదొక రాజకీయ పార్టీలో చేరుతారని పలు సందర్బాల్లో ప్రచారం జరిగింది. తాజా పరిణామాల నేపథ్యంలో వైసీపీలో చేరేందుకు సిద్ధమయ్యారు. ముద్రగడ తనయుడికి నామినేటెడ్ పదవిని ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. ఎన్నికల షెడ్యూల్‌ వెలువడటానికి ముందే ముద్రగడ కుమారుడికి నామినేటెడ్ పదవి ఇస్తారని ప్రచారం జరుగుతోంది.

Show comments