Mudragada Vs Pawan: కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభంను, ఆయన కుమార్తె క్రాంతిని కలుపుతాను తప్పా.. కుటుంబాలను విడదేసేవాడిని నేను కాదంటూ జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలుకు కౌంటర్ ఎటాక్‌కు దిగారు ముద్రగడ పద్మనాభం.. ఈ రోజు మీడియాతో మాట్లాడిన ఆయన.. పవన్ కల్యాణ్ నీ మెగా ఫ్యామిలీ చరిత్ర గురించి కూడా చెప్పు.. మీ కుటుంబంలో ఎవరు లవ్ మ్యారేజ్ చేసుకున్నారు.. తాగి తందనాలు ఆడుతున్నారు.. ఎవరు ఎవరితో ఉంటున్నారు చెప్పండి అంటూ హాట్ కామెంట్లు చేశారు.. నీ ముగ్గురు భార్యల గురించి కూడా చెప్పు అని సవాల్ చేశారు.. కానీ, నా కుటుంబంలో ఎవరికి ఏమైనా మా అమ్మాయిని పంపొద్దు.. నా కూతురితో తెగతెంపులు చేసేశారు.. చాలా రిలీఫ్ వచ్చింది.. హ్యాపీగా ఉన్నాను.. మా అమ్మాయి కూడా ఎప్పుడు ఇక్కడికి వస్తానని అనొద్దు అని పేర్కొన్నారు. ఇక, ఆయన సీటుకు దిక్కులేదు.. మా అమ్మాయికి సీటు ఇస్తానంటున్నాడు అది మా కర్మ అంటూ విమర్శలు గుప్పించారు.
ఇక, పవన్ కల్యాణ్ చెప్పేది సొల్లు.. మా బతుకు మమ్మల్ని బతకనివ్వండి అంటూ ఫైర్ అయ్యారు ముద్రగడ.. కులాల మధ్య, కుటుంబాల మధ్య చిచ్చు పెట్టాలని మీ గురువుగారు చెప్పారా? అంటూ ఎద్దేవా చేశారు. చంద్రబాబు ఎస్టేట్ లో పవన్ కల్యాణ్ మార్కెటింగ్ మేనేజర్, జనరల్ మేనేజర్ అంటూ దుయ్యబట్టారు. గురువుగారి ఆజ్ఞ ప్రకారం పని చేస్తున్నాడు.. కాపు కులాన్ని మొత్తం పోగు చేస్తున్నాడు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. నా కూతురిని.. ముద్రగడ పద్మనాభం కూతురుగా ఎందుకు పరిచయం చేసావు? అని నిలదీశారు.. నీకు సిగ్గు లేదా? బాగా నటిస్తున్నావు.. నువ్వు వదిలేసిన భార్యలను, ఉన్న భార్యను కూడా పరిచయం చేయాలి అని డిమాండ్ చేశారు. భీమవరం, గాజువాకలో తన్ని తరిమేశారు… పిఠాపురంలో కూడా అదే జరుగుతుంది అని జోస్యం చెప్పారు.
కాగా, కాకినాడలో నిర్వహించిన సభలో ముద్రగడ పద్మనాంభం కూతురు, ఆమె భర్తను పరిచయం చేసిన పవన్ కల్యాణ్.. ముద్రగడ పద్మనాభంను, ఆయన కుమార్తె క్రాంతిని కలుపుతాను తప్పా వేరు చేయనని స్పష్టం చేశారు. పెద్దలు పది మాటలు అంటారు.. నన్ను మీ నాన్నగారి దగ్గరికి తీసుకుని వెళ్ళండి.. ఆయనకు చెప్పి నేను తీసుకువస్తానని పద్మనాభం కుమార్తె క్రాంతితో పవన్ అన్నారు. తండ్రిని కూతురిని వేరు చేసే వ్యక్తిని కానన్నారు. తండ్రి బాధను, కూతురు బాధ్యతను అర్థం చేసుకోగలనని తెలిపారు. ముద్రగడ వైసీపీకి వెళ్లిన నాకు ఇబ్బంది లేదు గౌరవిస్తానని పవన్ కల్యాణ్ పేర్కొన్న విషయం విదితమే.