Site icon NTV Telugu

MSVG : ఆమె ఒప్పుకోవడం నా లక్.. అనిల్ రావిపూడి షాకింగ్ కామెంట్స్

Nainatara,anilravipudi

Nainatara,anilravipudi

టాలీవుడ్ సక్సెస్ డైరెక్టర్ అనిల్ రావిపూడి సంక్రాంతికి మరో బ్లాక్‌బస్టర్‌తో సిద్ధమవుతున్నాడు. ఈసారి మెగాస్టార్ చిరంజీవితో కలిసి ‘మన శంకర వరప్రసాద్ గారు’ సినిమాను తీసుకొస్తున్నాడు. మూవీ రిలీజ్ డేట్ అనౌన్స్‌మెంట్ సందర్భంగా అనిల్ మీడియాతో చాలా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. చిరంజీవి, ఈ సినిమా కోసం తన‌ను ‘పిండేస్తున్నాడమ్మా అబ్బాయి’ అని కామెంట్ చేసిన విషయంపై స్పందిస్తూ.. ‘చిరంజీవి స్ట్రెంత్, కామెడీ‌ని ఆడియన్స్ ఎలా చూడాలని కోరుకుంటారో అలా చూపించడానికి నా వంద శాతం ఎఫర్ట్స్ పెట్టాను, ఈ సినిమాలో ఆయన విపరీతంగా నచ్చుతారు’ అని తెలిపారు. ఇక హీరోయిన్ నయనతార గురించి అడిగినప్పుడు.. ‘చాలామంది అడిగారు, నయనతార ఎలా ఒప్పుకున్నారు? అని అడగా..

Also Read : MSVG: ప్రీమియర్స్, టికెట్ హైక్స్‌పై నిర్మాత సాహు గారపాటి క్లారిటీ!

నా టైమ్ బాగుండి ఆమె ఒప్పుకున్నారు. ఆమెకు కాన్సెప్ట్ కూడా బాగా నచ్చింది’ అని అనిల్ తనదైన స్టైల్లో సరదాగా వివరించా‌డు. అంతే కాదు తెలుగు సినిమాకు నాలుగు స్తంభాలైన చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్‌లలో ఎవరైనా ఇద్దరిని కలిపి చూపించాలని తానెప్పుడూ అనుకున్నానని, ఈ సినిమాలో చిరంజీవి మరియు వెంకటేష్ లను కలిపి చూపించే అదృష్టం నాకు దక్కిందని సంతోషం వ్యక్తం చేశారు. ఇద్దరినీ కలిసి చూడాలన్నది ప్రేక్షకుల కల అని, ఈ సినిమాలో వాళ్ళు ఎలా ఎంటర్టైన్ చేయబోతున్నారో చూడమని కోరాడు. సంక్రాంతి తనకు చాలా ఇష్టమని, తన గత సంక్రాంతి సినిమాల్లాగే, ఈ MSVG కూడా బాగా నవ్విస్తుందని, ఇందులో చిరంజీవిలోని అప్‌డేటెడ్ వెర్షన్ కామెడీని చూస్తారని తెలిపాడు. కాగా ‘మన శంకర వరప్రసాద్ గారు’ మూవీ జనవరి 12న థియేటర్లలో విడుదల కానుంది.

Exit mobile version