MSVG 2nd Day Collections: సంక్రాంతి కానుకగా విడుదలైన “మన శంకర వర ప్రసాద్ గారు” (Mana ShankaraVaraPrasad Garu) చిత్రం మొదటి రోజు నుంచే రికార్డు స్థాయి వసూళ్లను రాబడుతోంది. మొదటి రోజు ఏకంగా 84 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను సాధించి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇక రెండో రోజు బాక్సాఫీస్ వద్ద మరింత ఊపు అందుకుంది. రెండు రోజులు ముగిసేసరికి ఈ చిత్రం మొత్తం వసూళ్లు 120 కోట్ల రూపాయల మార్కును చేరుకుంది. ఇందుకు సంబంధించి తాజాగా చిత్ర బృందం ఓ పోస్టర్ ను రిలీజ్ చేసింది.
Sreeleela : అసలైన విజయం ఇప్పుడే దక్కింది.. కోలీవుడ్ ఎంట్రీపై శ్రీలీల ఆసక్తికర వ్యాఖ్యలు
కేవలం థియేటర్ల దగ్గరే కాకుండా ఆన్‌లైన్ టికెట్ బుకింగ్స్‌లో కూడా ఈ సినిమా రికార్డులు తిరగరాస్తోంది. గత 24 గంటల్లో బుక్ మై షో (BookMyShow) లో ఏకంగా 4 లక్షలకు పైగా టికెట్లు అమ్ముడయ్యాయి. దీన్ని బట్టి చూస్తే మెగాస్టార్ మ్యానియా ఏ రేంజ్‌లో ఉందో అర్థం చేసుకోవచ్చు. షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి భీమ్స్ సిసిరోలియో అందించిన సంగీతం పెద్ద ప్లస్ పాయింట్. సంక్రాంతి సెలవులు ఇప్పుడే మొదలవ్వడంతో, రాబోయే మూడు నాలుగు రోజుల్లో ఈ వసూళ్లు మరింత భారీగా పెరిగే అవకాశం ఉందని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి, నయనతారల కెమిస్ట్రీతో పాటు అనిల్ రావిపూడి మార్క్ కామెడీ పండటంతో ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్లకు క్యూ కడుతున్నారు.
