Site icon NTV Telugu

MS Dhoni: 2011 వరల్డ్ కప్ నాటి ధోనీ ఫొటో.. ఎమోషనల్ అవుతున్న ఫ్యాన్స్

Dhoni

Dhoni

భారత క్రికెట్ జట్టులో అత్యంత సక్సెస్ ఫుల్ కెప్టెన్ ఎవరు అంటే.. మహేంద్ర సింగ్ ధోనీ అని చెప్పవచ్చు. అతని కెప్టెన్సీలో భారత్‌కు మూడు ఐసీసీ టైటిళ్లను సాధించిపెట్టాడు. ధోనీ సారథ్యంలో టీమిండియా.. మొదటగా టీ20 ప్రపంచకప్, ఆ తర్వాత వన్డే ప్రపంచకప్, ఛాంపియన్స్ ట్రోఫీలను గెలుచుకుంది. టీమిండియా ఐసీసీ టైటిల్స్ ను గెలిచి 28 ఏళ్లు అవుతుంది. 2011 ప్రపంచకప్‌ ఫైనల్‌లో ధోనీ కొట్టిన విన్నింగ్‌ సిక్స్‌ అందరి మదిలో గుర్తుండిపోతుంది. ఆ తర్వాత ఐసీసీ టైటిల్‌ సాధించాలన్న భారత్‌ కల కలగానే మిగిలిపోయింది.

కాగా.. ఇటీవల BCCI తన X (గతంలో ట్విట్టర్)లో ఒక పోస్ట్‌ను పంచుకుంది. అందులో భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని (MS ధోని) 2011 ప్రపంచ కప్ ట్రోఫీని తాకినట్లు కనిపించింది. అతని ఫోటో చూసిన అభిమానులు చాలా ఎమోషనల్ అయ్యారు. అంతేకాకుండా.. ట్విట్టర్‌లో తమ స్పందనలను తెలియజేస్తున్నారు.

ఇదిలా ఉంటే.. ఎంఎస్ ధోనీ కేవలం ఐపీఎల్ లో మాత్రమే ఆడుతున్నాడు. అది కూడా.. ధోనీకి ఈ సీజన్ చివరిదని అందరూ అనుకుంటున్నారు. ముంబై ఇండియన్స్‌తో జరగబోయే మ్యాచ్‌కి ముందు ఎంఎస్ ధోనీ ఫోటో వైరల్ అవుతోంది. ఈ చిత్రంలో ధోని 2011 ప్రపంచకప్ ట్రోఫీతో కనిపిస్తున్నాడు. ఈ ఫోటోను షేర్ చేస్తున్నప్పుడు, BCCI ఎంఎస్ ధోని ప్రపంచ కప్ ట్రోఫీ.. అన్యోన్యమైన జంట అని రాసింది.

ఏప్రిల్ 14న వాంఖడే మైదానంలో సీఎస్‌కే జట్టు ముంబై ఇండియన్స్‌తో తలపడనుంది. ఐపీఎల్ 2024 పాయింట్ల పట్టికలో సీఎస్‌కే జట్టు మొత్తం 6 పాయింట్లతో మూడో స్థానంలో ఉంది. ప్రస్తుత సీజన్‌లో సీఎస్కే.. ఐదు మ్యాచ్‌లలో 3 గెలిచింది.. 2 మ్యాచ్‌లు ఓడిపోయింది. ఎంఎస్ ధోని ఇప్పటి వరకు ఐదు మ్యాచ్‌లు ఆడి 37 పరుగులు మాత్రమే చేశాడు.

Exit mobile version