MS Dhoni: ‘తలా ఫర్ ఏ రీజన్.!’ CSK మ్యాచ్ ఓడినా అభిమానుల అభిమానం గెలుచుకున్న మిస్టర్ కూల్..!

Ms Dhoni

Ms Dhoni

MS Dhoni: చెన్నై సూపర్ కింగ్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ మధ్య జరిగిన మ్యాచ్ తర్వాత చెపాక్ స్టేడియంలో ఎమోషనల్ సన్నివేశాలు కనిపించాయి. మ్యాచ్ ఫలితం కంటే కూడా అభిమానుల హృదయాలను గెలుచుకున్న వ్యక్తిగా మరోసారి నిలిచాడు మిస్టర్ కూల్ MS ధోని. చెన్నైలోని ఎం.ఏ.చిదంబరం స్టేడియం (చెపాక్)లో మ్యాచ్ ముగిసిన తర్వాత కూడా వేలాది మంది అభిమానులు స్టేడియంలోనే ఉండిపోయారు. వారందరికీ అభివాదం చేస్తూ ధోనీ మైదానం చుట్టూ నెమ్మదిగా వాక్ చేశాడు ధోని. ఆ సమయంలో అభిమానులు “ధోనీ.. ధోనీ” అంటూ స్టేడియాన్ని మార్మోగించారు.

అయితే ఈ సందర్భంగా అందరి దృష్టిని ఆకర్షించిన విషయం ధోనీ చేసిన ప్రత్యేక జెష్చర్. బౌండరీ లైన్ దగ్గర పనిచేస్తున్న ఫోటోగ్రాఫర్లకు CSK వస్తువులను స్వయంగా అందించాడు. దీంతో అక్కడున్నవారు ఆనందంతో ఉప్పొంగిపోయారు. అంతేకాదు, అక్కడే ఉన్న ఫోటోగ్రాఫర్లతో ధోనీ సెల్ఫీలు కూడా దిగాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మ్యాచ్‌లో చెన్నై ఓడిపోయినా.. అభిమానుల కోసం ధోనీ చూపించిన ప్రేమ, వినయం మరోసారి అందరి హృదయాలను గెలుచుకుంది. చెపాక్ వెలుగుల్లో అభిమానులతో కలిసి నడిచిన ధోనీ క్షణాలు ఐపీఎల్ 2026 చెన్నై అభిమానుల్లో ప్రత్యేక జ్ఞాపకంగా మిగిలిపోనున్నాయి.