NTV Telugu Site icon

MS Dhoni New Look: ఎంఎస్ ధోనీ ‘వింటేజ్’ లుక్.. మహేష్ బాబునే డామినేట్ చేశాడుగా!

Ms Dhoni New Look

Ms Dhoni New Look

Vintage Look of MS Dhoni Goes Viral: టీమిండియా మాజీ క్రికెట‌ర్ ‘ఎంఎస్ ధోనీ’ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ప్రపంచ క్రికెట్‌లో అత్యుత్తమ ఫినిషర్‌గా మాత్రమే కాదు.. అత్యుత్తమ కెప్టెన్‌గా పేరు సంపాదించాడు. ప్రపంచ క్రికెట్‌లో ఏ కెప్టెన్‌కు సాధ్యంకాని రీతిలో మూడు ఐసీసీ ట్రోఫీలు (2007 టీ20 ప్రపంచకప్, 2011 వన్డే ప్రపంచకప్, 2013 ఛాంపియన్ ట్రోఫీ) సాదించాడు. మహీ తన ఆట, కెప్టెన్సీతో క్రికెట్‌లో ‘ఐకాన్’గా నిలిచాడు. అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికి మూడు సంవత్సరాలు అయినా మహీ క్రేజ్ ఇప్పటికీ తగ్గలేదు. ఎప్పటికప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తూనే ఉన్నాడు.

ఎంఎస్ ధోనీ తన హెయిర్ స్టైల్‌లతో ఎందరో అభిమానులను సంపాదించుకున్నాడు. ఎప్పటికప్పుడు హెయిర్ స్టైల్‌లు మార్చే ధోనీ.. తాజాగా మరో సరికొత్త హెయిర్ స్టైల్‌తో దర్శనమిచ్చాడు. కెరీర్ ఆరంభంలో టార్జ‌న్ త‌ర‌హా హెయిర్ స్ట‌యిల్‌తో కనిపించిన మహీ.. చాలా ఏళ్ల తర్వాత ఇప్పుడు దాదాపు అలాంటి హెయిర్ స్ట‌యిల్‌తో మెరిశాడు. ఓ యాడ్ షూట్ కోసం ధోనీ త‌న త‌ల వెంట్రుక‌ల్ని సరికొత్తగా కట్ చేయించాడు. టాప్ హెయిర్ స్ట‌యిలిస్ట్‌ ఆలిమ్ హ‌కిమ్.. ధోనీకి సరికొత్త హెయిర్ స్టైల్‌ చేశాడు. ఇందుకు సంబందించిన ఫోటోల‌ను త‌న ఇన్‌స్టాలో హ‌కిమ్ అప్‌లోడ్ చేశాడు.

2007లో వచ్చిన ‘అతిథి’ సినిమాలో టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హెయిర్ స్టైల్‌ మాదిరే ఎంఎస్ ధోనీ హెయిర్ స్టైల్‌ ఉంది. దాంతో మహేష్, ధోనీని పోల్చుతున్నారు. ధోనీ కొత్త హెయిర్ స్ట‌యిల్‌ ఫోటోలపై ఫాన్స్ సరదాగా కామెంట్స్ చేస్తున్నారు. ‘ధోనీ భాయ్.. సూపర్ హెయిర్ స్ట‌యిల్‌’, ‘మహీ భయ్యా హెయిర్ స్ట‌యిల్‌ అదిరిపోయింది’, ‘ఎంఎస్ ధోనీ.. మహేష్ బాబునే డామినేట్ చేశాడుగా’ అంటూ ఫాన్స్ కామెంట్స్ పెడుతున్నారు.

Also Read: Hydrogen Bus: హైడ్రోజన్ బస్సులో టెస్ట్ డ్రైవ్ చేసిన కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ.. పిక్స్ వైరల్!

యూఎస్ ఓపెన్ 2023 సమయంలో గుబురు గడ్డంతో కనిపించిన ఎంఎస్ ధోనీ.. ఇటీవల పిలకతో (పోనీటైల్‌) దర్శనమిచ్చాడు. తాజాగా లూజ్ హెయిర్‌తో బ్లాక్ స్పెడ్స్ పెట్టుకుని.. అచ్చం హీరో మహేశ్ బాబులా కనిపిస్తున్నాడు. ఇక 15 ఆగస్ట్ 2020లో అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్ అయినప్పటికీ.. మహీ ఆటగాడిగా ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో కొనసాగుతున్నాడు. 2024లో చెన్నై జట్టుకు నాయకత్వం వహించడానికి సిద్ధంగా ఉన్నాడు. అంతర్జాతీయ కెరీర్‌లో ధోనీ 90 టెస్ట్‌లు, 350 వన్డేలు, 98 టీ20 మ్యాచ్‌లు ఆడాడు.

Show comments