Site icon NTV Telugu

MS Dhoni: అమరావతికి మహేంద్ర సింగ్ ధోని.. ఆ విషయమై సీఎం చంద్రబాబుతో కీలక భేటీ..!

Ms Dhoni

Ms Dhoni

MS Dhoni: భారత క్రికెట్ చరిత్రలో అత్యంత విజయవంతమైన కెప్టెన్లలో ఒకరైన మహేంద్ర సింగ్ ధోని ఈ నెల 9న అమరావతికి రానున్నారు. ప్రపంచ క్రికెట్‌లో ‘కూల్ కెప్టెన్’గా గుర్తింపు పొందిన ధోని, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో ప్రత్యేకంగా సమావేశం కానున్నట్లు సమాచారం. ఈ భేటీలో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో క్రికెట్ అభివృద్ధి, యువ ప్రతిభను వెలికితీయడానికి రాష్ట్రంలో క్రికెట్ అకాడమీ ఏర్పాటు అంశంపై చర్చ జరిగే అవకాశముందని తెలుస్తోంది.

కిడ్నీలో స్టోన్స్ వద్దు అంటే ఇవి తప్పక పాటించండి.. సూపర్ సింపుల్ డైట్ టిప్స్!

అంతర్జాతీయ స్థాయిలో అనుభవం కలిగిన ధోని మార్గదర్శకత్వంలో ఏపీలో ఆధునిక క్రికెట్ అకాడమీ ఏర్పాటు చేస్తే యువ క్రికెటర్లకు భారీ అవకాశాలు లభిస్తాయని క్రీడా వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. మహేంద్ర సింగ్ ధోని భారత జట్టుకు కెప్టెన్‌గా 2007 టీ20 వరల్డ్ కప్, 2011 వన్డే వరల్డ్ కప్, 2013 ఛాంపియన్స్ ట్రోఫీ మూడు ఐసీసీ ట్రోఫీలు గెలిపించిన ఏకైక కెప్టెన్‌గా రికార్డు సృష్టించారు. వికెట్‌కీపర్‌గా, ఫినిషర్‌గా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన ధోని.. తన కూల్ కెప్టెన్సీలో నాయకత్వంతో భారత క్రికెట్‌కు స్వర్ణ యుగాన్ని చూసింది.

ఎలుకల బెడదతో విసిగిపోయారా? ఇల్లు తుడిచే నీటిలో ఇది కలిపితే చాలు.. చిటికెలో మాయం!

Exit mobile version