MS Dhoni Heap Praise on Virat Kohli: టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీపై వరల్డ్ మోస్ట్ సక్సెస్‌ఫుల్ కెప్టెన్ ఎంఎస్ ధోనీ ప్రశంసల వర్షం కురిపించాడు. ప్రపంచ క్రికెట్‌లో విరాట్ అత్యుత్తమ బ్యాటర్ అని కొనియాడాడు. భారత్ కోసం ఇద్దరం కలిసి చాన్నాళ్లు కలిసి ఆడామని, మైదానంలో తాము సహచరులం అని చెప్పాడు. సారథిగా అండర్ 19 ప్రపంచకప్ గెలిచిన అనంతరం.. 2008లో మహీ సారథ్యంలోనే విరాట్ అంతర్జాతీయ క్రికెట్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. ధోనీ అండతో విరాట్ అంచెలంచెలుగా ఎదిగాడు.
Also Read: Gold Rate Today: మగువలకు శుభవార్త.. నేటి గోల్డ్ రేట్స్ ఇవే!
తాజాగా ఓ కార్యక్రమంలో పాల్గొన్న ధోనీని విరాట్ కోహ్లీతో ఉన్న రిలేషన్ గురించి ప్రశ్నించగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘మేమిద్దరం 2008 నుంచి కలిసి ఆడాం. మా మధ్య వయసు వ్యత్యాసం ఉంది. కోహ్లీకి నేను సోదరుడినా లేదా సహచరుడినా.. మీరు ఏమని పిలుస్తారో నాకైతే తెలియదు. ఇద్దరం భారత్ కోసం చాన్నాళ్లు కలిసి ఆడాం. మైదానంలో మేం సహచరులం. ఇప్పటికీ విరాట్ అత్యుత్తమ ప్లేయర్ అని చెబుతా’ అని అన్నాడు. విరాట్ సైతం ధోనీతో తనకు ఉన్న సంబంధాన్ని తరుచూ గుర్తు చేస్తుంటాడు. ధోనీ తనకు పెద్దన్న అని చాలా ఇంటర్వ్యూల్లో చెప్పుకొచ్చాడు.
