NTV Telugu Site icon

MS Dhoni: ప్రతినెలా ధోనికి పెన్షన్.. బీసీసీఐ గట్టిగానే ఇస్తోందిగా!

Dhoni

Dhoni

MS Dhoni: భారత క్రికెట్ చరిత్రలో తనదయిన ముద్ర వేసిన వ్యక్తి మహేంద్ర సింగ్ ధోనీ. ఫార్మాట్ ఏదైనా సరే భారత జట్టును విజయవంతంగా నడిపించిన ధోనీ, అత్యంత విజయవంతమైన కెప్టెన్‌గా గుర్తింపు పొందాడు. ధోని క్రికెట్ లో సాధించిన రికార్డులు, అవార్డ్స్, విజయాలు అబ్బో.. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో చెప్పవచ్చు. ఇకపోతే, భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (BCCI) మాజీ క్రికెటర్లకు వారి సేవలను గుర్తించి పెన్షన్ అందిస్తోంది. ఆటగాడు ఆడిన మ్యాచులు, భారత జట్టుకు చేసిన సేవలను బట్టి పెన్షన్ మొత్తాన్ని నిర్ణయిస్తారు. ఆటగాళ్లకు ఆర్థిక భద్రత కల్పించడమే ఈ పథకం ప్రధాన ఉద్దేశం. ముఖ్యంగా, టీమిండియాకు ఆడిన మ్యాచుల ఆధారంగా పెన్షన్ మొత్తాన్ని నిర్ణయిస్తారు.

Read Also: Pakisthan: పాకిస్తాన్ రైలు హైజాక్.. జాతీయ భద్రతపై కీలక సమావేశం

ఇందులో భాగంగా.. 75 కంటే ఎక్కువ టెస్ట్‌లు ఆడిన లేదా 50 కంటే ఎక్కువ టెస్ట్‌లు ఆది ఉంది టీమిండియా అద్భుత విజయాల్లో తోడ్పడిన క్రికెటర్లకు రూ. 70,000 పెన్షన్ అందుతుంది. అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ తీసుకున్న ఆటగాళ్లకు బీసీసీఐ 2022లో పెన్షన్ పథకాన్ని మరింత మెరుగుపరిచింది. అప్పటి బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ తీసుకున్న నిర్ణయాలతో ఆటగాళ్లకు పెన్షన్ మొత్తం పెరిగింది. పురుషులతో పాటు మహిళా క్రికెటర్లకూ ఈ పథకం వర్తించనుంది.

Read Also: Khakee The Bengal Chupur : బెంగాల్ టైగర్ ‘ఖాకీ’గా సౌరభ్ గంగూలీ

ధోనీ తన అంతర్జాతీయ క్రికెట్ కెరీర్‌లో 90 టెస్టులు, 350 వన్డేలు, 98 టీ20లు ఆడాడు. ఈ నేపథ్యంలో అతడికి బీసీసీఐ నుంచి నెలకు రూ. 70,000 వరకు పెన్షన్ లభిస్తోంది. అయితే ఆర్థికంగా ఎంతో స్థిరంగా ఉన్న ధోనీ ఈ పెన్షన్ మొత్తాన్ని పూర్తిగా చారిటీ కార్యక్రమాలకు ఇవ్వనున్నట్లు సమాచారం. ప్రచారాన్ని పెద్దగా కోరుకోని ధోనీ తన సేవా కార్యక్రమాలను ఎంతో గోప్యంగా ఉంచుతాడు. ఇక ధోని లాగే మరికొంతమంది ప్రముఖ క్రికెటర్ల పెన్షన్ వివరాలు ఇలా ఉన్నాయి. సచిన్ టెండూల్కర్, సునీల్ గవాస్కర్ లకు రూ. 70,000 , సిక్సర్ల వీరుడు యువరాజ్ సింగ్‌కు రూ. 60,000 పెన్షన్, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న మాజీ క్రికెటర్ వినోద్ కాంబ్లికి రూ. 30,000 పెన్షన్ ఇలా అనేకమంది టీమిండియా ఆటగాళ్లు ప్రతినెలా పెన్షన్ పొందుతున్నారు.