NTV Telugu Site icon

MS Dhoni-R Ashwin: ఎంఎస్ ధోనీకి ఇదే నా చివరి బర్త్‌డే విషెస్‌.. వైరల్‌గా ఆర్ అశ్విన్ ట్వీట్!

Ms Dhoni R Ashwin

Ms Dhoni R Ashwin

Ravichandran Ashwin Cheeky Birthday wish to MS Dhoni, Adds disclaimer: టీమిండియా మాజీ కెప్టెన్‌ ఎంఎస్ ధోనీ శుక్రవారం (జులై 7) 42వ పడిలోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా భారత్‌కు మూడు ఐసీసీ ట్రోఫీలు అందించిన ధోనీకి సోషల్‌ మీడియాలో పుట్టిన రోజు శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. టీమిండియా క్రికెటర్స్ విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, రిషబ్ పంత్, రవీంద్ర జడేజా లాంటి వారు విషెష్ చెప్పారు. అయితే టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌ చెప్పిన విషెష్ మాత్రం బిన్నంగా ఉంది. ట్విటర్ వేదికగా ఎంఎస్ ధోనీకి చివరిసారిగా పుట్టిన రోజు శుభాకాంక్షలు చెబుతున్నా అని ట్వీట్ చేశాడు.

‘జూలై 7వ తేదీన గొప్ప వ్యక్తికి జన్మదిన శుభాకాంక్షలు చెప్పకుండా ఉంటే.. విపత్క పరిస్థితులను ఎదుర్కోవాల్సి ఉంటుందని నాకు తెలుసు. పుట్టినరోజు శుభాకాంక్షలు మహీ భాయ్. గమనిక: ఎవరికైనా ట్విట్టర్‌లో ఇదే నా చివరి బర్త్‌డే విషెస్‌. ఇకనుంచి నేను నేరుగా లేదా ఫోన్ కాల్‌ చేసి శుభాకాంక్షలు చెబుతా’ అని రవిచంద్రన్ అశ్విన్‌ ట్వీట్ చేశాడు. అక్కడితో ఆగకుండా.. ఈ గమనిక మాత్రం గాసిప్‌లను పుట్టించే వారికి, స్టోరీలను మార్చే వారి కోసం అని పేర్కొన్నాడు. ప్రస్తుతం యాష్ ట్వీట్ నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది.

Also Read: Yatra-2 Motion Poster: నేను విన్నాను, నేను ఉన్నాను.. యాత్ర-2 మోషన్ పోస్టర్‌ రిలీజ్‌!

రవిచంద్రన్ అశ్విన్‌ ట్వీట్‌పై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. అశ్విన్‌ థ్రెడ్స్‌ ఖాతాను తెరుస్తాడు కాబట్టే ట్విటర్‌ను పక్కన పెడతామో అని కామెంట్స్ వస్తున్నాయి. ‘ఎంఎస్ ధోనీ ఫోన్ నంబర్‌ లేనందునే ట్విటర్‌లో పోస్టు పెట్టాడు’. ‘నువ్వు పెట్టిన ట్వీట్‌ ఎంఎస్ ధోనీ చూడడు’, ‘వచ్చే ఏడాది నువ్వు ఫోన్‌ చేసినా ధోనీ ఎత్తడు’ అంటూ ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు.

Also Read: Disadvantages Of Yogurt: పెరుగుతో పాటు వీటిని అస్సలు తినొద్దు.. భారీ మూల్యం తప్పదు!

Show comments