NTV Telugu Site icon

MS Dhoni-Donald Trump: డొనాల్డ్ ట్రంప్‌తో గోల్ఫ్ ఆడిన ఎంఎస్ ధోనీ.. పిక్స్ వైరల్!

Ms Dhoni Donald Trump

Ms Dhoni Donald Trump

Former US President Donald Trump hosted a Golf game for MS Dhoni: భారత్ తరఫున ఆడేప్పుడు నిత్యం బిజీబిజీగా ఉండే మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ.. రిటైర్మెంట్ ఇచ్చాక తెగ ఎంజాయ్ చేస్తున్నాడు. స్నేహితులు మరియు కుటుంబ సభ్యులతో సరదా సమయం గడుపుతున్నాడు. ఐపీఎల్ 2023లో చెన్నై సూపర్ కింగ్స్‌ను విజేతగా నిలిపిన మహీ.. ఆపై కొన్ని రోజులు రాంచీ వీధుల్లో చక్కర్లు కొట్టాడు. అనంతరం చెన్నైలో సినిమా ప్రమోషన్స్‌లో హంగామా చేశాడు. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా పర్యటిస్తున్నాడు.

టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ ఇటీవల యూఎస్ ఓపెన్ 2023 మ్యాచ్‌లో కనిపించాడు. అభిమానుల మధ్య కూర్చుని టెన్నిస్ మ్యాచ్ ఎంజాయ్ చేశాడు. ప్రస్తుతం యుఎస్‌ఎలో ఉన్న మహీ.. అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో కలిసి గోల్ఫ్ ఆడాడు. ట్రంప్ ఆహ్వానం మేరకు అతడిని కలిసేందుకు వెళ్లిన ధోనీ.. సరదాగా గోల్ఫ్ గేమ్ ఆడాడు. ఇందుకు సంబంధించిన ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Also Read: Gautam Gambhir: గంభీర్‌ రూటే సపరేట్.. ఆప్షన్స్‌ను కాదని మరో ఆటగాడిని ఎంచుకున్నాడు! ఊహించని సమాధానం

అంతర్జాతీయ క్రికెట్ ఆడటం మానేసినప్పటికీ.. ఇప్పటికీ ప్రపంచంలోని అత్యంత ప్రజాదరణ పొందిన క్రికెటర్లలో ఒకడుగా ఎంఎస్ ధోనీ కొనసాగుతున్నాడు. ఇందుకు కారణం.. మహీ బ్యాటింగ్, కీపింగ్ మరియు కెప్టెన్సీ. రైల్వే స్టేషన్‌లో టిక్కెట్ కలెక్టర్‌గా పని చేసిన మహీ.. అనతి కాలంలోనే ప్రపంచంలోనే అత్యుత్తమ కెప్టెన్ అయ్యాడు. ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2007, ఐసీసీ వన్డే ప్రపంచకప్ 2011 మరియు ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2013ని భారత్ జట్టుకు అందించాడు. 15 ఆగస్ట్ 2020లో అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్ అయినప్పటికీ అతను ఆటగాడిగా ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో కొనసాగుతున్నాడు. 2024లో చెన్నై జట్టుకు నాయకత్వం వహించడానికి సిద్ధంగా ఉన్నాడు.