MS Dhoni-Donald Trump: డొనాల్డ్ ట్రంప్‌తో గోల్ఫ్ ఆడిన ఎంఎస్ ధోనీ.. పిక్స్ వైరల్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Former US President Donald Trump hosted a Golf game for MS Dhoni: భారత్ తరఫున ఆడేప్పుడు నిత్యం బిజీబిజీగా ఉండే మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ.. రిటైర్మెంట్ ఇచ్చాక తెగ ఎంజాయ్ చేస్తున్నాడు. స్నేహితులు మరియు కుటుంబ సభ్యులతో సరదా సమయం గడుపుతున్నాడు. ఐపీఎల్ 2023లో చెన్నై సూపర్ కింగ్స్‌ను విజేతగా నిలిపిన మహీ.. ఆపై కొన్ని రోజులు రాంచీ వీధుల్లో చక్కర్లు కొట్టాడు. అనంతరం చెన్నైలో సినిమా ప్రమోషన్స్‌లో హంగామా చేశాడు. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా పర్యటిస్తున్నాడు.
టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ ఇటీవల యూఎస్ ఓపెన్ 2023 మ్యాచ్‌లో కనిపించాడు. అభిమానుల మధ్య కూర్చుని టెన్నిస్ మ్యాచ్ ఎంజాయ్ చేశాడు. ప్రస్తుతం యుఎస్‌ఎలో ఉన్న మహీ.. అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో కలిసి గోల్ఫ్ ఆడాడు. ట్రంప్ ఆహ్వానం మేరకు అతడిని కలిసేందుకు వెళ్లిన ధోనీ.. సరదాగా గోల్ఫ్ గేమ్ ఆడాడు. ఇందుకు సంబంధించిన ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Also Read
- Bribe in Dead Drop Method: డెడ్ డ్రాప్ పద్ధతిలో లంచాలు.. టౌన్ ప్లానింగ్ అధికారి సునీత ట్రాప్‌లో సంచలన విషయాలు.!
- Astrology: అక్టోబర్ 06 మంగళవారం దినఫలాలు.. ఈ రాశివారికి అంతా మంగళదాయకమే..
- FIR Registered: బీజేపీ సీనియర్ మహిళా జాతీయ నాయకురాలిపై లైంగిక వేధింపులు.. అల్వాల్‌లో కేసు నమోదు..
- Andhra Pradesh: కొత్తగా 4 పోలీస్ కమిషనరేట్లు.. విలీన గ్రామాలపై రీనోటిఫికేషన్
Also Read: Gautam Gambhir: గంభీర్ రూటే సపరేట్.. ఆప్షన్స్‌ను కాదని మరో ఆటగాడిని ఎంచుకున్నాడు! ఊహించని సమాధానం
అంతర్జాతీయ క్రికెట్ ఆడటం మానేసినప్పటికీ.. ఇప్పటికీ ప్రపంచంలోని అత్యంత ప్రజాదరణ పొందిన క్రికెటర్లలో ఒకడుగా ఎంఎస్ ధోనీ కొనసాగుతున్నాడు. ఇందుకు కారణం.. మహీ బ్యాటింగ్, కీపింగ్ మరియు కెప్టెన్సీ. రైల్వే స్టేషన్‌లో టిక్కెట్ కలెక్టర్‌గా పని చేసిన మహీ.. అనతి కాలంలోనే ప్రపంచంలోనే అత్యుత్తమ కెప్టెన్ అయ్యాడు. ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2007, ఐసీసీ వన్డే ప్రపంచకప్ 2011 మరియు ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2013ని భారత్ జట్టుకు అందించాడు. 15 ఆగస్ట్ 2020లో అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్ అయినప్పటికీ అతను ఆటగాడిగా ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో కొనసాగుతున్నాడు. 2024లో చెన్నై జట్టుకు నాయకత్వం వహించడానికి సిద్ధంగా ఉన్నాడు.
Former US President Donald Trump hosted a Golf game for MS Dhoni.
– Thala fever in USA….!!! pic.twitter.com/8V7Vz7nHMB
— Johns. (@CricCrazyJohns) September 8, 2023
MS Dhoni playing golf with Donald Trump.
– The craze for Dhoni is huge. pic.twitter.com/fyxCo3lhAQ
— Johns. (@CricCrazyJohns) September 8, 2023
తాజావార్తలు
-
Bribe in Dead Drop Method: డెడ్ డ్రాప్ పద్ధతిలో లంచాలు.. టౌన్ ప్లానింగ్ అధికారి సునీత ట్రాప్‌లో సంచలన విషయాలు.!
-
Realme P4s Lite 4G: రూ.16,499కే 7,000mAh బ్యాటరీతో Realme P4s భారత్ లో లాంచ్.. 120Hz డిస్‌ప్లే, 13MP కెమెరా!
-
Bypoll Election 2026: నందిగ్రామ్ నుంచి నాగావ్ వరకు ఎన్నికల సమరం.. 6 స్థానాల్లో నేడు పోలింగ్, ఫలితాలు ఎప్పుడంటే?
-
Astrology: అక్టోబర్ 06 మంగళవారం దినఫలాలు.. ఈ రాశివారికి అంతా మంగళదాయకమే..
-
FIR Registered: బీజేపీ సీనియర్ మహిళా జాతీయ నాయకురాలిపై లైంగిక వేధింపులు.. అల్వాల్‌లో కేసు నమోదు..
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!