NTV Telugu Site icon

MS Dhoni Joins BJP Photo Viral: బీజేపీలోకి ఎంఎస్ ధోని.. పక్కా ప్లాన్ అదే

Dhoni

Dhoni

MS Dhoni Joins BJP Photo Viral: భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ ధోని బీజేపీలో చేరనున్నారు. ఇది ఎంతవరకు నిజమో తెలియదు కానీ చాలా రోజుల తర్వాత మళ్లీ ఇదే వార్తపై ఇప్పుడు జోరుగా చర్చ జరుగుతోంది. ప్రస్తుతం ఆయన కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిసిన ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. జార్ఖండ్ డైనమైట్ బీజేపీలో చేరుతున్నారంటూ అందుకు సాక్ష్యం ఇదేనంటూ నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు. ఇదే క్రమంలో ఈ ఫోటో వెనుక రాజకీయ కోణం ఏమీ లేదని మరికొంత మంది అంటున్నారు. తమిళనాడులో ఇండియా సిమెంట్ వజ్రోత్సవ కార్యక్రమానికి అమిత్ షా హాజరయ్యారు.

Read Also: Minister Botsa Satyanarayana: జగన్ కు రాజకీయాలకంటే రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యం

ఇండియా సిమెంట్ కంపెనీ బీసీసీఐ మాజీ ప్రెసిడెంట్, ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీ యజమాని శ్రీనివాస్ యాజమాన్యంలోనే ఉంది. దీంతో ఈ కార్యక్రమానికి ధోని హాజరయ్యారు. ఈ వేడుకలో అమిత్ షా, ధోనీ కలిసిన ఫోటోను సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున షేర్ కావడంతో నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ కామెంట్ చేస్తున్నారు. ఈ క్రమంలో గతేడాది క్రితం పార్టీలో చేరిన ఇండియన్ క్రికెటర్ భార్య రవీంద్ర జడేజా భార్య రివాబా జడేజాకు బీజేపీ అధిష్టానం ఎమ్మెల్యేగా టికెట్ కన్ఫర్మ్ చేసింది.