NTV Telugu Site icon

MS Dhoni: టీమిండియా హెడ్ కోచ్ పదవికి ధోని అనర్హుడు.. ఎందుకో తెలుసా..

Msd

Msd

ప్రస్తుతం టీమిండియా హెడ్ కోచ్ గా ఉన్న రాహుల్ పదవి కాలం రెండు రోజుల్లో మొదలయ్యే టి20 ప్రపంచ కప్ 2024 తర్వాత ముగియనుంది. దీంతో బీసీసీఐ మరోసారి రాహుల్ ద్రావిడ్ ను కొనసాగించకుండా కొత్త కోచ్ కోసం వెతుకులాటను మొదలు పెట్టింది. అయితే ఇందుకోసం బిసిసిఐ అప్లికేషన్లను కూడా స్వీకరించింది. ఇప్పటికే ఈ పదవి కోసం చాలామంది సీనియర్ ఆటగాళ్లు అప్లై చేసుకున్నట్లు సమాచారం. కాకపోతే భారతదేశంలో చాలామందికి కోరికగా ఓ అంశం నిలుస్తోంది. అదేంటంటే.. టీమిండియా మాజీ కెప్టెన్ రెండు ప్రపంచ కప్పులను టీంకు అందించిన కెప్టెన్ గా ఉన్న మహేంద్ర సింగ్ ధోనిని టీమిండియా హెడ్ కోచ్ గా రావాలని కోరుకుంటున్నారు.

Girlfriend For Rent: ఇండియాలో గర్ల్ ఫ్రెండ్ ఫర్ రెంట్.. రెండు రోజులకు పది వేలే.. కానీ?

కాకపోతే మహేంద్రసింగ్ ధోని ఈ పదవికి దరఖాస్తు చేసుకునేందుకు అనర్హుడు. అయితే దీనికి కారణం లేకపోలేదు. బీసీసీఐ నిబంధనల ప్రకారం.. టీమ్ ఇండియా హెడ్ కోచ్ పదవికి అన్ని క్రికెట్ ఫార్మేట్లోనూ రిటైర్మెంట్ తీసుకున్న ఆటగాళ్లు మాత్రమే హెడ్ కోచ్ పదవికి అర్హులు. ఈ విషయాన్ని బీసీసీఐ వారి నిబంధనలో స్పష్టంగా తెలియచేసింది. కాకపోతే మహేంద్ర సింగ్ ధోని ఆగస్టు 15, 2020 నాటికి అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు చెప్పినప్పటికీ., ప్రస్తుతం చెన్నై సూపర్ కింగ్స్ లో అతడు ఓ ఆటగాడుగా కొనసాగుతున్నాడు. ఈ ఏడాది ఐపీఎల్ తర్వాత రిటైర్మెంట్ ప్రకటిస్తాడని అనుకున్న చివరికి అది జరగకపోవడంతో టీమిండియా కోచ్ పదవికి ధోని అనర్హుడుగా తెలుస్తోంది. ఇది ఇలా ఉండగా.. 2021లో యూఏఈలో జ‌రిగిన టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌ లో ధోని మెంటార్‌ గా వ్య‌వ‌హరించాడు. కాకపోతే., ఆ టోర్నీలో టీమిండియా గ్రూప్ ద‌శ‌లోనే ఓడిపోయింది.

Chiranjeevi – Ajith: ఆనాటి జ్ఞాపకాలను గుర్తుచేసుకున్న చిరు.. తమిళ హీరోతో మెగాస్టార్ చిరు..

ఈ విషయాలన్నీ ఇలా ఉన్నా కానీ.. మహేంద్రుడికి టీంఇండియా కోచ్ పదవి చేపట్టడానికి సుముఖత చూపించట్లేదని తెలుస్తోంది. దీనికి కారణం కూడా లేకపోలేదు.. 17 వ ఐపీఎల్ సీజన్ లో ధోని బాగానే ఆడిన ఆయన ఫిట్నెస్ తో కొన్ని ఇబ్బందులను ఎదురుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే తాజాగా టీమిండియా హెడ్ కోచ్ పదవికి దరఖాస్తులు సోమవారంతో ముగిశాయి. ఆ పదవి కోసం దరఖాస్తు చేసుకోవడానికి బీసీసీఐ పబ్లిక్ గూగుల్ ఫామ్ ని విడుదల చేయగా.. అందుకోసం ఏకంగా 3000 పైన దరఖాస్తులు అందాయి. ఇందులో కొన్ని నివేదికల ప్రకారం.. సచిన్ టెండూల్కర్, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, హోం మంత్రి అమిత్ షా లాంటి పేర్లతో అనేక నకిలీ దరఖాస్తులు వచ్చాయని తెలుస్తోంది.