Site icon NTV Telugu

MS Dhoni: ఎంఎస్ ధోనినీ డీజిల్ ఇంజన్తో పోల్చిన డివిలియర్స్

Ab De Villiers

Ab De Villiers

AB de Villiers: 2008లో ప్రారంభ‌మైన ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ ( IPL) ఈ ఏడాది 17వ ఐపీఎల్ 2024 సీజ‌న్ కు సిద్ధమైంది. ఈ టోర్నమెంట్లో 10 జట్లు పాల్గొంటున్నాయి. కాగా, ఈ మెగాటోర్నీ మార్చి 22 నుంచి ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ – రాయల్ ఛాలెంజ్ బెంగళూరు జట్లు త‌ల‌ప‌డ‌బోతున్నాయి. ఈ రెండు జట్లపై దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ AB డివిలియర్స్ స్పందించారు.

Read Also: Vishwak Sen: మా సినిమా గురించి కూడా నలుగురు పెద్ద మనుషులు మాట్లాడండయ్యా..

ఇక, మహేంద్ర సింగ్ ధోనీ, చెన్నై సూపర్ కింగ్స్ జట్టుపై దక్షిణాఫ్రికా ఆటగాడు ఏబీ డివిలియర్స్ ప్రసశంలు కురిపించారు. ఈ సందర్భంగా ఎంఎస్ ధోని ఎప్పటికి అంతం లేని డీజిల్ ఇంజిన్ తో పోల్చాడు. ఒక ఆటగాడు చాలా కాలం పాటు అత్యున్నత స్థాయిలో ఆడటం చాలా కష్టం అని పేర్కొన్నారు. ఐపీఎల్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ తరఫున ధోనీ తన అమూల్యమైన ప్రదర్శన చేస్తున్నాడు.. గత కొన్ని ఏళ్లుగా క్యాష్ రిచ్ లీగ్ లో తన ప్రదర్శనతో అందరికి ఆకట్టుకుంటున్నాడు అని చెప్పుకొచ్చారు. గత సంవత్సరం కూడా ఐదవ టైటిల్‌ సాధించి సక్సెస్ ఫుల్ కెప్టెన్‌గా ధోనీ నిరూపించుకున్నాడు అంటూ ఏబీ డివిలియర్స్ తెలిపారు.

Read Also: Em Chesthunnav OTT: ఓటీటీలోకి మరో లవ్ స్టోరీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

ఇక, ఎంఎస్ ధోని ఎంతటి అద్భుతమైన ఆటగాడో.. అంతటి అద్భుతమైన కెప్టెన్ అంటూ డివిలియర్స్ తన యూట్యూబ్ ఛానెల్‌లో పేర్కొన్నాడు. ముంబై ఇండియన్స్‌తో పాటు అత్యధిక ఛాంపియన్‌షిప్‌లను గెలుచుకోవడం ద్వారా సీఎస్కే ఒక శక్తిగా నిలిచిపోయిందన్నారు. ఆ జట్టు విజయంలో ఎక్కువ భాగం కోర్‌కి కట్టుబడి ఉండటమే.. సీనియర్ ఆటగాళ్ల సమూహంతో పాటు MSD నాయకత్వం, ప్రశాంతమైన కోచ్ గా స్టీఫెన్ ఫ్లెమింగ్‌, రవీంద్ర జడేజా నేతృత్వంలోని సీనియర్ ఆటగాళ్ళు ఈ అద్భుతమైన సంస్కృతిని సజీవంగా ఉంచారు అంటూ ఈ దక్షిణాఫ్రికా ఆటగాడు పేర్కొన్నారు.

Read Also: Adilabad Crime: మానవత్వం మంటగలిపే ఘటన.. చెత్తకుప్పలో నవజాత శిశువు

అయితే, సీఎస్కేను ఓడించడం ఎప్పుడూ సులభం కాదు అని ఏబీ డివిలియర్స్ అన్నారు. ఆ టీమ్ ఎల్లప్పుడూ విజయవంతమైన జట్టుగానే కొనసాగుతుందన్నారు. అలాగే, విజయవంతమైన ఫ్రాంచైజీగా చెన్నై సూపర్ కింగ్స్ ఉందన్నారు. మార్చి 22న చెన్నైలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో చెన్నై తన తొలి మ్యాచ్ ను ఆడబోతుంది.

Exit mobile version