NTV Telugu Site icon

MS Dhoni: అక్కడ భారీ సిక్స్ లతో రెచ్చిపోయిన ధోని..!

Dhonu

Dhonu

భారతీయ క్రికెట్ అభిమానులు ఎంతగో ఆత్రంగా ఎదురు చూస్తున్న ఐపీఎల్ 17 సీజన్ మరో ఐదు రోజుల్లో మొదలు కాబోతోంది. మార్చి 22న చెన్నై వేదికగా చపాక్ స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య మొదటి మ్యాచ్ జరగబోతోంది. సిరీస్ మొదలు కాకముందే చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కెప్టెన్ ఎంఎస్ ధోని ప్రత్యర్థి జట్లకు కాస్త గట్టిగానే వార్నింగ్ ఇస్తున్నట్లు కనపడుతుంది.

Also read: Kiran Rathore: నన్ను తప్పుగా వాడుకోవాలనుకుంటున్నారు.. హీరోయిన్ ఘాటు వ్యాఖ్యలు..!

ఐపీఎల్ కోసం చెన్నై చేరుకున్న ఎంఎస్ ధోని చపాక్ గ్రౌండ్ ప్రాక్టీస్ లో భాగంగా బిజీబిజీగా ఉన్నాడు. ఇక గ్రౌండ్లో జరుగుతున్న ప్రాక్టీస్ సెషన్ లో భాగంగా ధోని తనదైన మార్క్ షార్ట్స్ తో భారీ సిక్సులను సంధిస్తున్నాడు. ఫాస్ట్ బౌలర్, స్పిన్నర్ అని తేడా లేకుండా ఆయన భారీ సిక్సులు కొడుతున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారాయి.

Also read: Om Bheem Bush : ‘ఓం భీం బుష్ ‘ లో మెరిసిన నలుగురు ముద్దుగుమ్మలు ఎవరో తెలుసా?

ఈ వీడియోని చూసిన క్రికెట్ అభిమానులు.. అందులో ముఖ్యంగా ధోని అభిమానులైతే., ‘తలైవా ఈజ్ బ్యాక్’ అంటూ కామెంట్ చేస్తున్నారు. మరి కొందరైతే ప్రత్యర్థి జట్లకు ఇక చుక్కలే అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఇకపోతే 42 ఏళ్ల ధోనీకి ఇది చివరి సీజన్ అయ్యే అవకాశం లేకపోలేదు. సీజన్ రిజల్ట్ ఎలా ఉన్నా.. ధోని క్రికెట్ కు గుడ్ బై చెప్పే టైం వచ్చింది. ఇక ఇప్పటివరకు చెన్నై సూపర్ కింగ్స్ ధోని సారథ్యంలో మొత్తంగా ఐదు టైటిల్స్ ను గెలుచుకుంది. 2010, 2011, 2018, 2021, 2023లో కప్పును కైవసం చేసుకుంది.