Site icon NTV Telugu

MS Dhoni: ఐపీఎల్‌కు ముందు ధోనీకి బిగ్ రిలీఫ్.. “ఒప్పందాల” ఆరోపణలపై బీసీసీఐ సంచలన తీర్పు..

Msd

Msd

MS Dhoni: భారత మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీకి ఊరట లభించింది. ‘కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్’ (పరస్పర ప్రయోజనాల ఘర్షణ) వివాదంలో బీసీసీఐ తీర్పు వెలువరించింది. బీసీసీఐ ఎథిక్స్ ఆఫీసర్ జస్టిస్ అరుణ్ మిశ్రా ధోనీపై వచ్చిన ఆరోపణలకు కొట్టేశారు. ధోనీ ఇప్పటికే సీఎస్‌కే తరఫున్ ఆడుతున్న విషయం తెలిసిందే. ఇదే సమయంలో క్రికెట్ అకాడమీల యజమానిగా ఉంటడం నిబంధలకు విరుద్ధమని ఆరోపణలు వచ్చాయి. ఈ ఆరోపణల్లో ఎలాంటి వాస్తవాలు లేవని బీసీసీఐ తీర్పు వెలువరించింది.

READ MORE: Farooq Abdullah: మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లాపై కాల్పులు..

ఈ అంశంపై బీసీసీఐ ఎథిక్స్ ఆఫీసర్ జస్టిస్ అరుణ్ మిశ్రా వివరణ ఇచ్చారు. “ఆర్కా స్పోర్ట్స్ అండ్ మేనేజ్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా ధోనీ క్రికెట్ అకాడమీలను ప్రారంభించిన మాట నిజమే. కానీ.. ఆ ఒప్పందం 2017లో జరిగింది. బీసీసీఐ కొత్త నిబంధనలు 2018 సెప్టెంబర్ నుంచి అమలులోకి వచ్చాయి. కాబట్టి పాత ఒప్పందాలకు ఇది వర్తించదు. ధోనీ కేవలం ఒక ప్లేయర్ మాత్రమే. అతనికి బోర్డులో లేదా ఫ్రాంచైజీలో ఎటువంటి ‘ఇన్‌స్టిట్యూషనల్ కంట్రోల్’ లేదా నిర్ణయాధికారం లేదు. కేవలం ఐపీఎల్ ప్లేయర్‌గా కొనసాగినంత మాత్రాన అది నిబంధనల ఉల్లంఘన కిందకు రాదు. అకాడమీ యజమానిగా ఉండటం వల్ల ధోనీ ఎవరికైనా ఫేవరిజం చూపినట్లు లేదా పక్షపాతంగా వ్యవహరించినట్లు ఎటువంటి ఆధారాలు లేవు. ఈ ఫిర్యాదు వెనుక వ్యక్తిగత కారణాలు ఉన్నాయి. ఫిర్యాదుదారుడికి ధోనీతో లేదా ఆ సంస్థతో ఉన్న వాణిజ్యపరమైన విభేదాల వల్లే ఈ కేసు వేశారు. ఇది ఆలస్యంగా చేసిన ఫిర్యాదు.” అని తీర్పులో పేర్కొన్నారు. ఎట్టకేలకు ఈ సీజన్‌ ఐపీఎల్ ప్రారంభానికి ముందే ధోనీకి క్లీన్ చీట్ రావడం ఊరట నిచ్చింది.

READ MORE: Kidney Risk : మూత్రాన్ని ఆపుకుంటున్నారా.? అయితే ఈ విషయాలు తెలిస్తే అస్సలు ఆ పని చేయరు.!

Exit mobile version